హైదరాబాద్ : హైదరాబాద్ తనకు సెలబ్రిటీ స్టేటస్ ను ఇచ్చిందని టెన్సిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సానియాతో ముచ్చటించిన 'సాక్షి'తో నగరంపై తనకున్న ప్రేమను పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..
'ఈ మహానగరంతో నా జీవితం ముడిపడి ఉంది. నా స్కూలింగ్, కాలేజీ, స్పోర్ట్స్ లైఫ్ అన్నీ హైదరాబాద్‌లోనే సాగాయి. నేను పక్కా హైదరాబాదీని. నగర వాతావరణమంటే చాలా ఇష్టం. నేను సాధించిన ప్రతి విజయంలోనూ నగరం వెన్నంటి ఉంది. ప్రతి న్యూ ఇయర్ వేడుకలకు సిటీలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. నా చిన్నప్పటికీ ఇప్పటికీ సిటీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. మా నాన్న నన్ను ఒక సెలబ్రిటీలా చూడాలనుకున్నారు. అందుకే అందరిలా ఇల్లు, చదువు, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో నన్ను పెంచలేదు. మెట్రోసిటీగా అవతరించిన హైదరాబాద్ ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. ఈ సిటీలో నేనూ భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది'.
Post a Comment