మొదట్లో గ్లామర్ ఇమేజ్‌తో ఎదిగిన హీరోయిన్లు ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి బయట పడాలనుకుంటున్నారా? దీనికి బదులు అవుననే వస్తోంది. క్రేజీ నటి నయనతార, సమంత, కాజల్‌అగర్వాల్ తదితర నటీమణులందరూ నాలుగు పాటలు, కొన్ని ప్రేమ సన్నివేశాల కథా పాత్రల్ని ఇప్పుడు కోరుకోవడం లేదు. తాజాగా గ్లామర్‌కు పేటెంట్‌గా మారిన నటి త్రిష ఆ ఇమేజ్ నుంచి బయట పడాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ మధ్య వచ్చిన ఎన్నై అరిందాల్ చిత్రంలో ఈ చెన్నై చిన్నది నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించారు. ప్రస్తుతం నాయకి అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తాజాగా ధనుష్‌కు జంటగా కొడి అనే చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్రలో నటించడానికి అంగీకరించారు.ఈ చిత్రం ఇటీవలే పొల్లాచ్చిలో ప్రారంభమైంది. అదే విధంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రమ్ అనే చిత్రంలో నాయకిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే త్రిష తను గ్లామర్ ఇమేజ్ నుంచి బయట పడాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అందాల భామ త్రిషను దర్శక నిర్మాతలు గ్లామర్ నుంచి బయట పడనిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే.
Post a Comment