అస్లే వరద బీభత్సంతో అతలాకుతలమైన తమిళనాడు ప్రజలను మూఢనమ్మకాలు మరింత కుంగదీస్తున్నాయి. కొందరు మహా పండితులు కూడా వారి మూఢనమ్మకాలను రెచ్చగొట్టి వారిని మరింత భయాందోళనలకు గురి చేస్తున్నారు. యమధర్మ రాజు తన దున్నపోతుపై ఇంటింటికి తిరుగుతూ ఇంటి యజమానుల ప్రాణాలు తీసుకపోతున్నాడనే ప్రచారం ఇప్పుడు సేలం జిల్లా అంతటా ప్రజలను నిద్రలేకుండా చేస్తోంది. ఇటువంటి పుకార్ల నిజానిజాలను తెల్సుకునేందుకు ప్రజలు వాళ్ళ మత పండితులను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రజలను మరింత భయపెడుతున్నారు. అందుకు విరుగుడు గా పూజలు పునస్కారాల పేరుతో పూజా పండితులు జేబులు నింపుకుంటున్నారు. మహిళలు తమ పుస్తెలతాడు కాపాడుకునేందుకు వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు. తెల్లవారుజామునే లేసి, తలస్నానం చేసి, ఇంటిముందు ముగ్గులు వేసి దీపాలు వెలిగిస్తున్నారు. తమ భర్తలు, పిల్లలతో కలిసి ఆంజనేయస్వామి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా ఈ తతంగం జరుగుతోంది కానీ యముడు కానీ కనీసం దున్నపోతు కానీ ఇప్పటి వరకు ఎవ్వరికీ కనపడలేదు. ఎవ్వరి ప్రాణాలు కూడా పోలేదు.
పోలీసులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు కల్పించిన అసత్యప్రచారాలను నమ్మి ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దంటూ హితవు చెబుతున్నారు.
Post a Comment