లండన్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు అలాన్ రిక్ మాన్(69-బ్రిటన్) కన్నుమూశాడు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న ఆయన తిరిగి కోలుకోలేక తుది శ్వాసవిడిచారు. రిక్ మాన్ చాలా ప్రసిద్ధి చెందిన నటుడు. హ్యారీ పోటర్ సిరీస్ చిత్రాల్లో ప్రొఫెసర్ గా ఆయన నటించిన పాత్ర ఇప్పటికే ప్రేక్షకుల మదిలో మెదులుతుంటుంది.
అంతేకాదు, బ్రిటన్ కు చెందిన ఈ నటుడు డై హార్డ్, ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ, రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్ వంటి విజయవంతమైన చిత్రాల్లో అసాధారణ నటనా ప్రతిభ చూపించారు. రాబిన్ హుడ్ చిత్రంలో నటనకుగానీ ఆయనకు బఫ్తా అవార్డు కూడా వచ్చింది. 'నటుడు, దర్శకుడు అయిన అలాన్ రిక్ మాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ చివరకు కన్నుమూసి మమ్మల్ని శోకసంద్రంలో ముంచాడు' అంటూ ఆయన కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. రిక్ మృతిపట్ల ప్రముఖ హాలీవుడ్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Post a Comment