హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుస్తక పఠనంలో భాగ్యనగరి వరుసగా మూడోసారి టాప్-5 నగరాల్లో నిలిచిందని అమెజాన్ తెలిపింది. 2015లో అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా జరిగిన పుస్తకాల అమ్మకాల ఆధారంగా పలు ఆసక్తికర అంశాలను నివేదిక రూపంలో వెల్లడించింది. టాప్-4లో ఉన్న హైదరాబాద్ వాసులు అమిష్ త్రిపాఠి రాసిన సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు పుస్తకాన్ని అత్యధికంగా కొనుగోలు చేశారు. 2014లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన చేతన్ భగత్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
7వ స్థానంలో ఉన్న మనోరమ ఇయర్ బుక్ 2015లో రెండో స్థానానికి ఎగబాకింది. తెలుగు పుస్తకాల విభాగంలో రోండా బైర్న్ రాసిన ద సీక్రెట్ పుస్తకం తెలుగు అనువాదం టాప్‌లో ఉంది. 2014లో అమ్ముడైన హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ కంటే సియాన్ ఆఫ్ ఇక్ష్వాకు మూడు రెట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక నగరాల వారీగా చూస్తే ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై టాప్-5లో ఉన్నాయి. 20వ స్థానంలో విశాఖపట్నం ఉంది.
Post a Comment