వెస్టిండీస్ 207/6
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులోనూ వెస్టిండీస్ జట్టు తడబడుతోంది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (174 బంతుల్లో 85; 10 ఫోర్లు) ఒక్కడే అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా మిగతా ఆటగాళ్లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దీంతో ఆదివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో ఆరు వికెట్లకు 207 పరుగులు చేసింది. క్రీజులో రామ్‌దిన్ (72 బంతుల్లో 23 బ్యాటింగ్; 2 ఫోర్లు), కార్లోస్ బ్రాత్‌వైట్ (35 బంతుల్లో 35 బ్యాటింగ్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) ఉన్నారు.
విండీస్ 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోగా డారెన్ బ్రేవో (95 బంతుల్లో 33; 6 ఫోర్లు)తో కలిసి క్రెయిగ్ బ్రాత్‌వైట్ రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించి ఆదుకున్నాడు. అయితే స్పిన్నర్ లియోన్ రెండు వికెట్లు తీసి విండీస్‌ను మళ్లీ కష్టాల్లోకి నెట్టాడు. వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 90 ఓవర్ల పూర్తి ఆట సాధ్యపడలేదు.
Post a Comment