వెండితెరపైకి సల్మాన్ బాడీగార్డ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎంతోమంది కొత్తనటులకు అవకాశాలను కల్పిస్తున్నాడు. తన సినిమాల్లో కొత్త హీరోయిన్లకు అవకాశం ఇవ్వటంతో పాటు ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిలింస్ ద్వారా కూడా కొత్త హీరోలను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సూరజ్ పంచోలి, అతియా శెట్టిలను వెండితెరకు పరిచయం చేసిన సల్మాన్, త్వరలోనే అతియా తమ్ముడు అహాన్ శెట్టిని కూడా హీరోగా పరిచయం చేయనున్నాడు. ఈ క్రమంలోనే తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నాడు సల్మాన్. చాలా కాలంగా సల్మాన్ దగ్గర బాడీగార్డ్ గా పనిచేస్తున్న షేరా కుమారుడు టైగర్ ను వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నాడట సల్మాన్. 22 ఏళ్ల టైగర్ కు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని బి టౌన్ వర్గాల సమాచారం.
Post a Comment