నాన్నకు ప్రేమతో పోస్టర్ రిలీజ్...
సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ʹనాన్నకు ప్రేమతోʹ. ఈ చిత్రం కొత్త పోస్టర్ ని దీపావళి సందర్బంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లండన్ లో స్ధిరపడ్డ మిలీనియర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ కు సంబంధించిన డిజైన్స్ ను ప్రత్యేకంగా ముంబైలో డిజైన్ చేయించారు. అలాగే ఎన్టీఆర్ హెయిర్ స్టెయిల్, గడ్డం, లుక్ పై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు సుకుమార్.
Post a Comment