‘సిమ్’ ఇంట్లో హోరాహోరీ!
భారీ వ్యయంతో కంపెనీల ప్రణాళికలు
* విలీనాలకు తెరలేపిన రిలయన్స్ కమ్యూనికేషన్స్
* వినూత్న వ్యూహాలతో వస్తున్న రిలయన్స్ జియో
* రూ.60 వేల కోట్లతో ఎయిర్‌టెల్ ప్రాజెక్ట్‌లీప్
* ఐడియా, టెలినార్, వొడాఫోన్ వ్యూహాలకూ పదును
* మాట నుంచి డేటాకు... 2015లో స్పష్టమయిన ట్రెండ్
* 2016లో ఈ దార్లోనే దూసుకెళ్లనున్న సంస్థలు
బండికి పెట్రోల్, డీజిల్ ఎలాంటివో... మొబైల్‌కు సిమ్ అలాంటిదే. టెలికం కంపెనీలు ఏ సేవలందించినా ఈ సిమ్‌తోనే. అందుకే.. సిమ్‌ను చాక్లెట్ కన్నా చీప్‌గా ఒకోసారి ఉచితంగానే ఇచ్చేస్తున్నాయి. దీనిద్వారా అందిస్తున్న సేవల మార్కెట్ విలువ... రూ.3.3 లక్షల కోట్లు కావటంతో సిమ్ కార్డును గుప్పిట పెట్టుకోవటానికి పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. 2జీ, 3జీ, 4జీ... డేటా, వాయిస్ అంటూ రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2015లో కొందరు తెరమరుగైపోగా... మరికొందరు చేతులు కలపటానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది మాత్రం యోధుల రాకతో పోరాటం కొత్త మలుపు తిరగబోతోంది.
ప్రాజెక్ట్ లీప్.. అంటూ ఎయిర్‌టెల్ పెద్ద అడుగే వేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్... సిస్టెమా శ్యామ్‌కు చెందిన ఎంటీఎస్‌ను కైవసం చేసుకోవటమే కాక... టవర్ల వ్యాపారాన్ని అమ్మేస్తోంది. ఎయిర్‌సెల్‌ను కొనబోతున్నట్లూ ప్రకటించింది. యూపీ, గుజరాత్ సర్కిళ్లలో 4జీ తరంగాలను రూ.3,310 కోట్లకు వీడియోకాన్ నుంచి ఐడియా కొంటోంది. బీఎస్‌ఎన్‌ఎల్ తన టవర్ల వ్యాపారాన్ని వేరు చేస్తోంది.
* ఇవన్నీ... 2016 ఆరంభానికి నాలుగురోజుల ముందు ఆరంగేట్రం చేసిన ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోను ఎదుర్కొనే సన్నాహాలే. ఏడేళ్ల కిందట దేశీ మార్కెట్లో 16 కంపెనీలు పోటీ పడగా... ఇపుడు 10 మిగిలాయి. 4జీ మార్కెట్లో మాత్రం ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, ఐడియా, వొడాఫోన్ మధ్యే పోటీ ఉంటుందనేది మార్కెట్ వర్గాల అంచనా.
* దేశవ్యాప్తంగా నవంబరు నాటికి 75 కోట్ల జీఎస్‌ఎం చందాదారులున్నారు. 17 కోట్ల మంది వద్ద స్మార్ట్‌ఫోన్లున్నాయి. వీరిలో 3జీ కస్టమర్ల సంఖ్య 9 కోట్లని ఐడియా సెల్యులర్ ఎండీ హిమాన్షు కపానియా చెప్పారు. 2019-20 నాటికి 3జీ, 4జీ వినియోగదార్ల సంఖ ్య 40-50 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.
* ఈ ఏడాది దేశంలో సగటున నెలకు 40 లక్షల మందికి పైగా కొత్త చందాదారులు నమోదయ్యారు. అంటే 2015లో కొత్తగా చందాదారులైన వారి సంఖ్య 7.5 కోట్ల పైనే. జూలై-సెప్టెంబరు మధ్య దేశంలో కొత్త యూజర్లు 1.3 కోట్ల మంది కాగా... చైనాలో 70 లక్షలు. అమెరికాలో 60 లక్షలు. ఇదీ మన టెలికం జోరు.
* కస్టమర్లను ఆకట్టుకోవడానికి 2009-10లో కంపెనీలు కాల్ రేట్లను 50% దాకా తగ్గించాయి. ఇప్పుడు ఇలాంటి యుద్ధం డేటా చార్జీలపై ఉండబోతోంది. ప్రస్తుతం పలు కంపెనీలు 3జీ స్థాయి ధరల్లోనే 4జీని ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో పెట్టబోయే ధరల ఆధారంగా మరిన్ని మార్పులు జరగవచ్చు.
* టెలికం రంగంలో తిరిగి కొత్త నియామకాల జోష్ ఉండనుంది. వచే ్చ ఆరు నెలల్లో సుమారు 30,000 మంది రిక్రూట్ అయ్యే అవకాశం ఉందని టీమ్‌లీజ్ అంచనా వేస్తోంది. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో భారత టెలికం పరిశ్రమ రూ.4.29 లక్షల కోట్లకు ఎగుస్తుందన్నది మార్కెట్ వర్గాల అంచనా.
* డేటా చార్జీలు తగ్గిస్తే వినియోగం మరింత పెరుగుతుంది కనుక కంపెనీల ఆదాయమూ పెరుగుతుందనేది పరిశ్రమ అంచనా. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు దీన్ని నిజం చేస్తున్నాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఎయిర్‌టెల్ డేటా ఆదాయం కిందటేడాది ఇదే కాలంతో పోలిస్తే 14.5 శాతం నుంచి 21.5 శాతానికి చేరింది. బీఎస్‌ఎన్‌ఎల్ డేటా ఆదాయం 92 శాతం ఎగసి 2014-15లో రూ.1,380 కోట్లుగా నమోదైంది. 3జీ కన్నా 4జీ వేగం ఎక్కువ కనక డేటా వినియోగం ఇంకా పెరుగుతుంది.
ఇవీ... భవిష్యత్ ప్రణాళికలు
ప్రాజెక్ట్ లీప్ పేరిట... నెట్‌వర్క్ విస్తరణకు మూడేళ్లలో ఎయిర్‌టెల్ రూ.60,000 కోట్లు వెచ్చిస్తోంది. ప్రస్తుతం సుమారు 300 పట్టణాల్లో 4జీ సేవలందిస్తోంది. ఐడియా వచ్చే మూడేళ్లకుగాను రూ.18,000 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ దక్షిణాదిన 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. 2016 జూన్ నాటికి 750 పట్టణాల్లో అడుగు పెట్టనుంది.
2015-16లో వొడాఫోన్ రూ.8,500 కోట్లు వెచ్చిస్తోంది. దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో 18,000 పట్టణాలు, నగరాల్లో 4జీ సర్వీసులను పరిచయం చేయనుంది. ఇప్పటికే సంస్థ రూ.95,000 కోట్ల దాకా ఖర్చుచేసింది. అర కిలోమీటరుకు ఒక టవర్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.7,700 కోట్లు వెచ్చిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్... ప్రైవేటు కంపెనీల్లా మార్కెటింగ్ చేస్తే వాటా పెంచుకోవటం ఖాయం. టెలినార్ త్వరలో హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ప్రవేశపెడుతోంది. నెట్‌వర్క్ ఆధునికీకరణ బాధ్యతను హువావె టెక్నాలజీస్‌కు అప్పగించింది.

Post a Comment