సహన వీరుల ʹయాప్‌వాప్సీʹ రివర్స్ అయ్యింది, స్నాప్ డీల్ బిజినెస్ పెరిగింది
దేశంలో అసహన పరిస్థితులపై ఆమిర్ ఖాన్ వాఖ్యలు స్నాప్ డీల్ సంస్థకు నష్టం తెస్తుందని మార్కెట్ వర్గాలు భావించాయి. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ స్నాప్ డీల్ మార్కెట్ మరింత పుంజుకుంది. ఆమిర్ ఖాన్ కు వ్యతిరేకంగా గళమెత్తిన సహన వీరులు... ఆయన బ్రాండ్ అంబాదిడర్ గా వ్యవహరిస్తున్న స్నాప్ డీల్ పై కూడా విరుచుకపడ్డారు. ʹఘర్‌వాప్సీʹ తరహాలో ʹయాప్‌వాప్సీʹ అనే వ్యతిరేక ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. స్నాప్ డీల్ యాప్ ను డిలీట్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో బేంబేలు పడ్డ స్నాప్ డీల్ ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అయితే సహన వీరులు అనుకున్నది వేరు జరిగింది వేరు...
ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నవంబర్ 23వ తేదీనాడు గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌డీల్ ఇండియా ర్యాంక్ 28వ స్థానంలో ఉండగా, ఆ మరుసటి రోజు కూడా అదే ర్యాంక్ కొనసాగింది. ఆ తదుపరి రోజు, అంటే 25వ రోజున ʹయాప్‌వాప్సీʹ అనే వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకొంది. తద్వారా స్నాప్‌డీల్ ఒక స్థానాన్ని అధిగమించి 27వ ర్యాంక్‌కు చేరుకుంది. నవంబర్ 26వ తేదీ నాడు ఒక్కసారిగా ఐదు ర్యాంకులు అధిగమించి 22వ ర్యాంక్‌కు చేరుకుంది. గత 30 రోజుల కాలంలో ఐదు ర్యాంక్‌లు అధిగమించడం ఇదే మొదటిసారి.

Post a Comment