ఇకపై ఎయిర్ టెల్ మన బిల్లులు చెల్లించదట !
ʹఎయిర్ టెల్ 4జీ ఎప్పుడైనా, ఎక్కడైనా వేగవంతమైన నెట్ వర్క్. ఒకవేళ ఇంతకన్నా వేగవంతమైన నెట్ వర్క్ మీరు చూపిస్తే, మేము జీవితాంతం మీ మొబైల్ బిల్లులు చెల్లిస్తాంʹ అంటూ ఎయిర్ టెల్ సంస్థ ప్రచారం ఇక ఆగిపోనుంది. ఈ 4జీ యాడ్ ప్రసారం ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ 4జీ ఉపసంహరించుకోనుంది. ఆ ప్రకటనను సమీక్షించిన ప్రకటనల ప్రమాణాల విభాగం (ఏఎస్ సీఐ) ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని భారతి ఎయిర్‌టెల్ కు నోటీసులు జారీ చేసింది. ఆ ప్రకటన కోడ్ చాప్టర్ 1.4ను అతిక్రమించి వాస్తవాలను వక్రీకరించేలా ఉందని తక్షణమే ఎయిర్ టెల్ తన యాడ్ ను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
ఓ వినియోగాదారుడు చేసిన ఫిర్యాదుతో ఏఎస్ సీఐ ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తన ప్రకటనను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. కాగా ఎయిర్ టెల్ ఈ ఏడాది ఆగస్ట్ లో 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Post a Comment