-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

May 10, 2016

చిక్కుముడి...?

 
చిక్కుముడులు... విప్పడం కష్టమే చికాకు కలిగించే జబ్బుల చిక్కులు అంతా ఇంతా కాదు. దానికి తోడు... మూఢనమ్మకం చిక్కుతోడైతే... ఇక మూడినట్లే అయినా... మోసాలు చేసేవాళ్లకు పోయేదేముంది? వెంట్రుక వేసి లాగితే... వస్తే కొండంత డబ్బు... పోతే రాలిన వెంట్రుక!!

వినోద టీవీ ముందు కూర్చుని ఉంది. ‘‘అక్కా! నువ్వు మంచి మార్కులతో పాసయ్యావు కదా. కాలేజ్‌లో చేరుతావా’’ అంటూ దగ్గరగా వచ్చి కూర్చుంది పెద్ద చెల్లెలు కల్యాణి. ‘‘ఏమో తెలియదు, అమ్మ చదివిస్తానంటోంది. నాన్న మాత్రం ముగ్గుర్ని చదివించాలంటే డబ్బుల రాశులున్నాయా అంటున్నారు’’ అంటూ నిర్లిప్తంగా టీవీ కేసి చూస్తోంది. టీవీలో ఒక్కసారిగా దృశ్యాలు మారిపోతున్నాయి. ఒక మహిళ చేతబడులు చేస్తోందని, మందు పెడుతోందని ఆరోపిస్తూన్న వార్తా కథనం అది.

‘‘అమాయకత్వం కాకపోతే చేతబడి ఏంటి, మందు పెట్టడం ఏంటి నాన్సెన్స్’’ అంటూ చిరాకు పడింది వినోద. సరిగ్గా అప్పుడే గేదెల పాలు తీసుకుని లోపలికి వచ్చింది వినోద తల్లి కమల. ‘‘నాన్సెన్స్ అంటావేంటే, పెద్ద నువ్వు ఇంగ్లిష్ నేర్చుకుంటే అంతా మారిపోద్దా. మనూళ్లో ఎంత మంది చేత మందుతాపారని కక్కించడం లేదు’’ అంటూ లోపలికెళ్లింది. కమల భర్త ‘‘ఏంటి తల్లీబిడ్డల ముచ్చట్లు’’ అంటూ కూతుళ్ల పక్కన కూర్చున్నాడు. ‘‘ఎవరి సంగతో ఎందుకు తల్లీ, కోడలికి మందు పెట్టిందని మీ నానమ్మను ఊరంతా ఎన్నెన్ని మాటలన్నారు’’ అంటూ తల్లి పట్ల సానుభూతి చూపించాడు కనకయ్య.

పిల్లలకు ఆ మాత్రం తీగ దొరికితే చాలు... డొంకంతా లాగే వరకు ఊరుకోరు. ఇంతలో చిన్నమ్మాయి కార్తీక కూడా వచ్చింది. ‘‘చెప్పు నాన్నా’’ అంటూ వీపు మీద సవారీ మొదలుపెట్టింది. ‘‘మీ నాన్న కాదులే నే చెప్తా ఇలా రండి’’ అని తాతయ్య మనుమరాళ్లను పిలిచాడు.
    
కమల మంచం మీద పడుకుని ఉంది. ‘‘ఎంతకూ లేవకపోతే ఇంట్లో పనులెలా కావాలి. ముగ్గురు ఆడపిల్లల్ని కనడమే కాక అలకొకటి. ఉన్న మాటంటే ఉలుకెక్కువ. ఈళ్లందర్నీ పెంచి పెళ్లిళ్లు చెయ్యడానికి ఎనుములున్నాయా? ఎకరాలున్నాయా? ఉన్న రెండెకరాల్లో పండితే పండే, ఎండితే ఎండే. తిండి గడిస్తే గొప్ప. తిని పండుకుంటే గడిచిపోవడానికి పుట్టింటి నుంచి ఏమైనా డబ్బుల మూటలు తెచ్చిందా’’ గేట్లు ఎత్తిన రిజర్వాయర్ ప్రవాహంలాగా సాగిపోతోంది కమల అత్త గొంతు. ‘‘ఒంట్లో బాగోలేకపోతే ఏం చేస్తుందే... పడుకోనీ, పొలం పోయినా ఏ పనులున్నాయ్ చెయ్యడానికి, వానలా పాడా... ఈ ఏడూ వానల్లేకపోతే కంచంలోకి ముద్ద వచ్చేదెట్లాగో’’ అంటూ తువ్వాలు దులిపి భుజాన వేసుకుని బయటికెళ్లాడు కమల మామ.
   
కమలకు ఆరోగ్యం బాగోలేదని చూడడానికి కులుమాల గ్రామానికి వచ్చాడు ఆమె తండ్రి. వియ్యంకురాలి ధోరణి ఆయనకు కూడా ఇబ్బందిగానే అనిపించింది. ‘‘అమ్మాయిని పది రోజులు మా ఊరికి తీసుకెళ్తా’’ అంటూ తీసుకెళ్లాడు. చిక్కి శల్యమై వచ్చిన కమలను చూసి పుట్టింట్లో వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘ఏ మందులేసినా తగ్గడం లేదు. పిల్లకు తిన్నది ఒంటబడుతున్నట్లు లేదు. ఓ సారి జహరాపురానికి తీసుకెళ్దాం’’ అంటూ అన్నదే తడవుగా మరుసటి రోజే ప్రయాణమయ్యారు తల్లీదండ్రి.
Visit::page::https://www.facebook.com/freshdeals365 
కర్నూలు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది జహరాపురం. ఆ ఊళ్లో ఓ వైద్యుడి ముందు కూర్చుని ఉన్నారు కమల, ఆమె అమ్మానాన్న. తమతో తెచ్చిన పండ్లు, కొబ్బరికాయ, దక్షిణ డబ్బు పళ్లెంలో పెట్టి భక్తిగా నమస్కరించారు. కమలను తేరిపార చూసి, తల్లిదండ్రుల ముఖాల్లోకి చదువుతున్నట్లు చూస్తూ ‘‘అమ్మాయికి మందు పెట్టారు’’ అన్నాడు. అసలే ఆందోళనగా ఉన్న వారు... ఆ మాటతో నిలువెల్లా వణికిపోయారు. ‘‘ఈమె చావు కోరుకునే వాళ్లెవరో’’ అన్నాడు సాలోచనగా.

అనుమానం భర్త మీదకు మళ్లించే ప్రయత్నమూ చేశాడు ఆ వైద్యుడు. భర్త తన చావు కోరుకోడన్నట్లు తల అడ్డంగా ఊపింది కమల. అనుమానాన్ని అత్త మీదకు మళ్లించాడు వైద్యుడు.  ‘‘మందు కక్కిస్తావా సామీ’’ దీనంగా అడుగుతున్నాడు కమల తండ్రి. ‘‘ఓ గంట సేపు అలా కూర్చోండి’’ అని వసారాలో ఓ చివరను చూపించాడు. కొంత సేపటికి ఓ జగ్గులో ద్రవంతో వచ్చాడు వైద్యుడు. ఎంత ప్రయత్నించినా ఆ ద్రవం గొంతు దిగడం లేదు. అలాగే బలవంతంగా తాగించాడు. కడుపులో తిప్పుతోంది. తల తిరిగినట్లవుతోంది. ‘‘వాంతి చేసుకో’’ అని ఒత్తిడి చేస్తున్నాడు.

కమల ముఖాన్ని పెకైత్తి తన కళ్లలోకి చూడమంటున్నాడు. భయంతో బేజారవుతోంది కమల. స్పృహతప్పుతోందనిపిస్తోంది. చెవులు మూశాడు. అంతలోనే భళ్లున వాంతయింది. వైద్యుడు తాగించిన ద్రవంతోపాటు వెంట్రుకల ఉండ, పచ్చగా పసరు పడ్డాయి. ‘‘హమ్మయ్య’’ అని ఊపిరి పీల్చుకున్నారు కమల తల్లిదండ్రులు. కమల వేళ్లాడిపోతోంది. అలాగే ఇంటికి తీసుకెళ్లారు. ఓ వారం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమెను అత్తగారింట్లో దించి వెళ్లారు తల్లిదండ్రులు.

పదిరోజులు పుట్టింట్లో ఉండి ఆరోగ్యంగా వస్తుందని ఇంటి పనులు, పొలం పనులన్నీ చక్కబెడుతుందని ఆశపడిన అత్తగారికి నిరాశే మిగిలింది. మంచం మీద పడుకోవట్లేదనే కానీ ఒంట్లో ఓపిక ఉన్నట్లు కనిపించడం లేదామెకు. ‘‘కమలకు మందుపెట్టారంట. జహరాపురానికి తీసుకెళ్లి కక్కించారు. ఎంత డబ్బు ఖర్చయిందో పాపం, మందు పారతాపడానికి ఖర్చంతా పుట్టింటి వాళ్లే పెట్టుకున్నారు. పాపం... ఆ అమ్మాయి కళ్లల్లో ప్రాణాలు నిలుపుకుని తిరుగుతోంది. అయినా ఆ అత్తకు అదేం పోయేకాలం. కొడుకు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు.

ఈ పిల్లను అడ్డు తొలగించుకుంటే కొడుక్కు మంచి కట్నంతో మళ్లీ పెళ్లి చేయవచ్చనే దుర్బుద్ధి’’ పక్కింటి, ఎదురింటి ఆడవాళ్లు మాట్లాడుకునే సంగతులు కమల చెవిన పడుతున్నాయి. భార్య ఆరోపణ విన్న కనకయ్య ‘‘మా అమ్మ ఎందుకు పెడుతుంది’’ అని అంతెత్తున ఎగిరాడు. తన గోడు అంతా అదే ఊళ్లో ఉన్న స్నేహితుడితో వెళ్లబోసుకున్నాడు.
   
‘‘మీ అమ్మకు మా అమ్మ మందు పెట్టిందని మీ అమ్మమ్మ నానా యాగీ చేసింది’’ అప్పటి వరకు మౌనంగా ఉన్న కనకయ్య నిష్టూరంగా అన్నాడు. ‘‘పిల్లలకు అలాగేనా చెప్పేది. అయినా తర్వాత మా అమ్మానాన్న వచ్చి ఊళ్లో వాళ్ల మాటలు విని అపోహపడ్డామని అత్తమ్మతో చెప్పలేదా’’ అని కమల వంట గదిలో నుంచే కసురుకున్నది. ‘‘అమ్మకు ఏమైందప్పుడు, ఏం బాగాలేదు. మందు తాపిస్తే ఆరోగ్యం బాగవ్వాలి కదా, ఎందుకు పాడవుతుంది’’ కూతుళ్లు ముగ్గురూ వంతుల వారీగా ప్రశ్నలు సంధించారు. కూతుళ్లను ఎలా సమాధాన పరచాలో తెలియలేదు కనకయ్యకు.

‘‘ఏమైతేనేం? నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. దెయ్యాల్లేవు, మందు పారతాపడాల్లేవు, నమ్మకండి. అందరూ భోజనాలకు లేవండి’’ అంటూ కమల కోప్పడడంతో పిల్లలు ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ తండ్రి ముఖంలోకి, తాత ముఖంలోకి చూశారు సమాధానం దొరుకుతుందేమోనని.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
కమలకు వచ్చిన చిక్కేంటి?
ఆ అమ్మాయికి టి.బి వచ్చింది. దేహం కృశించి పోతుంటే మందుపారతాపడం, దెయ్యం వదిలించడం అంటూ భూతవైద్యాలు చేయిస్తూ కొద్ది నెలలు గడిపారు. నా దృష్టికి వచ్చిన తర్వాత వారిని జనవిజ్ఞానవేదిక స్థాపకులు బ్రహ్మారెడ్డి గారి దగ్గరకు తీసుకెళ్లాను. తొమ్మిది నెలల పాటు మందులు వాడిన తర్వాత కమల మామూలైంది. మా దగ్గర పోషకాహార లోపంతో చాలా మంది టి.బి బారిన పడ్డారు. కమలను రక్షించుకోగలిగాం, కమల ఉదంతాన్ని చూపిస్తూ చాలా మందిని చైతన్య పరిచాం. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లాలనే చైతన్యం తెచ్చాం. అయినా ఇంకా భూతవైద్యులను నమ్ముకుని... డబ్బు పోగొట్టుకుని, అనారోగ్యాన్ని ముదరపెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకునే వాళ్లు ఎందరో ఉన్నారు.
 - ముహమ్మద్ మియా, జనవిజ్ఞాన వేదిక కార్యకర్త, కర్నూలు
 
వెంట్రుకలు ఎలా వచ్చాయి?
అదంతా వైద్యుల హస్తలాఘవమే. ఉప్పు నీటిని తాగిస్తారు. వాంతి చేసుకోవడానికి చెవులు పట్టుకున్నప్పుడు ముఖం పక్కనున్న వారికి కనిపించకుండా వైద్యులు అడ్డుగా నిలబడతారు. తమ చేతిలో నుంచి వెంట్రుకలను పేషెంటు నోటిలోకి తోస్తారు. పేషెంటు ఆ సంగతి గుర్తించే స్థితిలో ఉండరు. ఒకవేళ గమనించినా గొంతులో నుంచి కొంత బయటకు వచ్చి అడ్డుపడుతుంటే చేత్తో తీశామని చెబుతారు. కొందరిని ఒకసారితో వదలరు. ఇంకా కడుపులో శేషం మిగిలే ఉందని కొద్ది వారాల పాటు తిప్పుకుంటూ డబ్బులాగుతుంటారు.




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more  Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu