-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

May 11, 2016

ఇలా ఉంటే ఎక్కువ కాలం బతుకుతారట!


మానవ శరీరాకృతికి, ఆయుష్షుకు దగ్గర సంబంధం ఉందని కనుగొన్నారు హార్వార్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. లావుగా ఉన్నవారితో పోల్చుకుంటే సన్నంగా ఉన్నవారు ఎక్కువ కాలం బతుకుతారని హార్వార్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా చిన్న వయసు నుంచి మధ్య వయసు వరకు బరువు పెరిగిన వారు త్వరగా చనిపోయే ప్రమాదముందని పరిశోధన నాయకుడు మింగ్‌యాంగ్‌ సాంగ్‌ తెలిపారు. మానవ జీవిత కాలంతో పోల్చుకుంటే 15 ఏళ్లు ముందగానే చనిపోయే రిస్క్‌ సన్నంగా ఉండే మహిళల్లో 12 శాతం, పురుషుల్లో 20 శాతం ఉంటుందట. అదే ఊబకాయంతో బాధపడుతున్న మహిళల్లో అయితే ఈ ప్రమాదం 20 శాతం, పురుషుల్లో 24 శాతం ఉంటుందట. శరీరాన్ని నాజూకుగా ఉంచే ప్రక్రియ చిన్నప్పుడే ప్రారంభించి జీవితాంతం కొనసాగిస్తే.. ఎక్కువ కాలం బతకొచ్చని సాంగ్‌ సూచించారు.
 

Visit::page::https://www.facebook.com/freshdeals365 
 మానవ శరీరాకృతి, మరణాల రేటుకు సంబంధించి 80 వేల మంది స్ర్తీలు, 36 వేల మంది పురుషులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. వారంతా పదేళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వరుకు ప్రతీ పది సంవత్సరాలకు తమ శరీరాకృతి ఎలా ఉండేదో వివరించారు. అలాగే 50 ఏళ్లప్పుడు వారి బీఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌)ను కూడా తెలిపారు. 60 ఏళ్ల తర్వాత వారిపై పరిశోధనలను కొనసాగించారు.





When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu