-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

May 04, 2016

పవన్ కు జోడిగా మలయాళీ బ్యూటీ ...?


భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. గతంలోలా.., లాంగ్ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ హీరోయిన్ ఎంపిక విషయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్, మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నాడట.

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలు కాకముందు అనీషా ఆంబ్రోస్ ను, ఆ సినిమాకు హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు ప్రకటించాడు పవన్. అయితే అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పవన్, కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశాడు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాన్నే పవన్ తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

బెంగళూర్ డేస్ సక్సెస్ తో ఆకట్టుకున్న మలయాళీ భామ పార్వతీ మీనన్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. మాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెప్పించిన పార్వతి స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి హీరోయిన్, పవన్ ఇమేజ్ కు ఎలా సూట్ అవుతుందన్న డైలామాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి పవన్ ఈ సారి రిస్క్ చేస్తాడా.? లేక అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతాడా..? చూడాలి.
 


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu