డయాబెటీస్ టైప్-2కు, సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరోన్కు లింకు ఉందనే విషయం శాస్తవేత్తలకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ దీన్ని ఇంతకాలం శాస్త్రవిజ్ఞానపరంగా ప్రయోగాలు నిర్వహించి నిరూపించలేకపోయారు. ఇప్పుడు మొట్టమొదటి సారిగా రెండింటికున్న ప్రత్యక్ష సంబంధాన్ని కనుగొన్నట్లు ‘తులేన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ ప్రొఫెసర్ ఫ్రాంక్ మావాయిస్-జార్విస్ వెల్లడించారు. రక్తంలోని చక్కెరను నియంత్రించే ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే క్లోమగ్రంధిలోని బీట్ సెల్స్‌లోకి టెస్టోస్టెరోన్ హార్మోన్‌ను ఇంజెక్ట్ చేయడం వల్ల బీటా సెల్స్ ఇన్సులిన్‌ను ఎక్కువ ఉత్పత్తి చేశాయని ఆయన చెప్పారు.
టెస్టోస్టెరోన్ హార్మోన్లు ఎక్కువగా లేని వారికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోన్ల చికిత్స ఇచ్చినట్లయితే మంచి ఫలితం ఉంటుందని ఫ్రాంక్ తెలిపారు. డయాబెటీస్ టైప్ 2 లేనివారిలో కూడా టెస్టోస్టెరోన్ హార్మోన్ లోపం కారణంగా అది వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆయన చెప్పారు. తాము ఈ హార్మోన్ ఉన్న, లేని మగ ఎలుకలపై జరిపిన పరిశోధనల వల్ల ఈ విషయం రూఢీ అయిందని ఆయన అన్నారు. తమ పరిశోధన ఫలితాలు టెస్టోస్టెరోన్ హార్మోన్ లోపం కారణంగా డయాబెటీస్‌తో బాధ పడుతున్న వారికి సరైన చికిత్స అందించేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు. పరిశోధనా వివరాలను ‘సెల్ మెటబాలిజమ్’ జర్నల్‌లో ప్రచురించారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365
Join::Group::https://www.facebook.com/groups/freshdeals365
Post a Comment