-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 28, 2016

క్లాత్ పిన్‌తో దుస్తులకు కాపలా..!!!

 
దుస్తుల్ని ఉతకడం సరే కానీ, వాటిని ఆరవేయడంలోనే చాలా కష్టాలు ఉంటాయి. అప్పటికి ఎండగానే ఉందనుకుంటే ఏ క్షణాన్నో వర్షం వచ్చి సగం ఆరిన దుస్తులు సాంతంగా తడిసిపోవచ్చు. ఇలా సగంలో ఆరిన దుస్తులు ముక్క వాసన కూడా వేస్తాయి. మళ్లీ ఉతికితే తప్ప అవి మామూలు స్థితికి రావు. వాతావరణం తేమగా ఉన్నప్పుడు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. బాగా ఎండగా ఉన్నప్పుడు ఎక్కువ సేపు అలాగే ఉంచితే దుస్తులు వాటి రంగును, ఆకర్షణను కోల్పోయే అవకాశం ఉంది.. ఇవేమీ లేకపోయినా టెర్రస్‌ పైన ఆరవేసిన దుస్తుల్ని ఇంటి పనిలో పడి ఒక్కోసారి మరిచిపోవడమూ జరగవచ్చు. ఇలాంటివన్నీ గుర్తు చేయడానికి. మామూలుగా అయితే, ఒక మనిషే అవసరమేమో అనిపిస్తుంది. అయితే ఆ అవ సరమేదీ లేకుండా ఆస్ర్టేలియాలోని లాండ్రీ డిటర్జెంట్‌ మేకర్‌ ఓఎమ్‌ఓ వారు క్లాతపిన్‌ ఒకటి తయారు చేశారు. ఇది బయట ఆరవేసిన దుస్తుల స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు చివిజిల్‌ ద్వారా తెలియచేస్తుంది. పెగ్గీ అనే ఈ యంత్రం, వై-ఫై ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సంధానం చేయబడి ఉంటుంది. ఇది వాతావరణ పరిస్థితుల్ని, వాతావరణంలోని తేమను, ఎండతీవ్రతను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. దుస్తులు పూర్తిగా ఆరిపోయిన క్షణాన్నే ఆ సమాచారాన్ని చేరవేసి వాటిని లోనికి తీసుకు వెళ్లడంటూ సూచిస్తుంది. పలురకాల సెన్సార్లు ఈ పెగ్గీ అనుబంధంగా ఉండడం వల్ల ఇది అనుక్షణం లాండ్రీమీద నిఘావేసి ఉంటాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియచేస్తూ ఉండడం వల్ల అన్ని పనులూ మానుకుని ఆరవేసిన దుస్తుల వద్దే కాపలా కాయాల్సిన అవసరం ఉండదు. ఆ తరవాత ఏర్పడబోయే వాతావరణ పరిస్థితుల్ని కూడా అది వెంట వెంట తెలియచేస్తూ ఉంటుంది. దుస్తులు ఆరవేయడానికి ఏది బాగా అనుకూలమో కూడా ముందే చెప్పేస్తుంది. ఈ స్మార్ట్‌ క్లాత్సస్యిన్‌ రీచార్జ్‌ చేయించడానికి, మీ కంప్యూటర్‌తో, యూఎ్‌సబి పార్ట్‌తో అనుసంధానం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త సౌకర్యం, దుస్తులు ఆరవేయడం తాలూకు సమస్త సమస్యల్నీ దూరం చేస్తుంది.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu