ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ నాయకుడి కోడలు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని బుధవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. నరేంద్ర పెద్ద కుమారుడు సంజయ్ కశ్యప్ భార్య అయిన హిమాని ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడికాలేదు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను యశోదా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
బాత్రూమ్ లో సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు సన్నిహితవర్గాలు వెల్లడించాయి. హిమాని తండ్రి బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. హిమాని ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదని ఘజియాబాద్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment