న్యూయార్క్: ఇద్దరు రిపోర్టర్లు చేసిన చిలిపి సరదా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. రబ్బరు బ్యాండ్లతో పుచ్చకాయను వారు పేల్చి వేసిన తీరు ఫేస్ బుక్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. ఓ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఒక ప్రయోగం చేద్దామనుకున్నారు.
అనుకుందే తడవుగా తెల్లని వస్త్రాలు నిండుగా ధరించి ఒక పుచ్చకాయను తెచ్చి టేబుల్ పై పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 500 రబ్బర్లు బ్యాండ్లు ఒకదాని తర్వాత మరకొకటి వేశారు. దాదాపు 45 నిమిషాలపాటు వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారు చేస్తున్న ఈ ప్రయోగాన్ని తొలుత చూసినవారు కాస్తంతా ఓపిక కోల్పోయి చిరాకుగా కనిపించారు. ఆ తర్వాత సరిగ్గా 500 రబ్బరు బ్యాండ్లు దాటిన తర్వాత బూమ్ అని ఒక్కసారిగా పుచ్చకాయ పేలిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను వారు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment