- చిరంజీవి
‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా అభివృద్ధి చెందాలి. ‘సరైనోడు’ సినిమా వేడుక వైజాగ్‌లోనే చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుబట్టారు. అయితే ప్రభుత్వం మాటలతో కాకుండా, చేతల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పించాలి’’ హీరో చిరంజీవి అన్నారు. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, క్యాథరిన్ థెరెస్సా ముఖ్యతారలుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం పాటల విజయోత్సవం ఆదివారం వైజాగ్‌లోని సముద్ర తీరంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ‘‘వైజాగ్‌తో నాది ప్రత్యేక అనుబంధం. రిటైరయ్యాక, వైజాగ్‌లో స్థిర నివాసం ఏర్పరచుకుంటాను.
ఇక, నాకు రామ్‌చరణ్ ఎలాగో బన్నీ కూడా అంతే. చిన్నతనం నుంచి సరదాగా డ్యాన్సులు వేసే బన్నీ కోసం ‘డాడీ’ సినిమాలో ఓ క్యారెక్టర్ సృష్టించి, అతని తెరంగేట్రానికి బీజం వేశానని గర్వంగా చెప్పుకుంటా. దర్శకుడు బోయపాటి శ్రీను నాకు ‘అన్నయ్య’ సినిమా టైమ్ నుంచి తెలుసు. అతనిలో ఉన్న అంకిత భావమే ఈ స్థాయికి చేర్చింది. నాకు అంతకు ముందు ‘సింహా’, లెజెండ్’ కథలు చెప్పినప్పుడు ఏవో కొన్ని మార్పులు సూచించాను. కానీ ‘సరైనోడు’ కథ చెప్పినప్పుడు మారు మాట్లాడలేదు. ఈ చిత్రానికి అతను సరైన డెరైక్టర్’’ అని వ్యాఖ్యానించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా మీ అంచనాలకు రీచ్ అవుతుందన్న నమ్మకం ఉన్నా దడగా ఉంది.
ఈ ఫంక్షన్ వైజాగ్‌లోనే ఎందుకు చేయాలనే దానికి కారణాలున్నాయి. మెగా ఫ్యామిలీ సినిమాలకు ఎన్నో రికార్డులను అందించింది. చిరంజీవిగారు ఏర్పరిచిన బాటలో ఇప్పుడు పవన్‌కల్యాణ్ నుంచి అల్లు శిరీష్ వరకూ అందరూ ప్రయాణిస్తున్నారు’’ అన్నారు. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ-‘‘నాకెందుకో ఈ సినిమా పాటల వేడుక వైజాగ్‌లోనే చేయాలని మనసులో అనిపించింది. అలాగే జరిగింది. ఈ సినిమా కేవలం ఊర మాస్ సినిమానే కాదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోషిస్తున్న విలన్ పాత్ర ఎంతగా నచ్చిందంటే, వేరే భాషల్లో ఈ కథను రీమేక్ చేస్తే నేను విలన్‌గా చేస్తానని చెప్పా’’ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ- ‘‘వైజాగ్‌లో ఈ సినిమా ఫంక్షన్ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడ ఇదే తొలి భారీ సినిమా వేడుక. ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా ఇక్కడే జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రసంగిస్తూ, ‘‘నేను ‘అన్నయ్య’ సినిమాకు అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశాను. ‘గంగోత్రి’ తర్వాత నేను మొదట దర్శకుణ్ణి కావడానికి బన్నికి కథ చెప్పాను. అదే ‘భద్ర’. కానీ తను అప్పుడు ‘ఆర్య’ సినిమా చేస్తున్నాడు. లవర్‌బాయ్ లుక్ పోతుందని సందేహించాడు.
కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్ సినిమా కరెక్ట్ కాదని చెప్పి నన్ను ‘దిల్’రాజుకు పరిచయం చేశారు. అలా నేను దర్శకుణ్ణి కావడానికి బన్నీ సగం కారణమయ్యాడు’’ అన్నారు. ‘‘ఇప్పటికీ ప్రతి షాట్‌ని తొలిషాట్‌గా భావించి, కష్టపడి చేసే అల్లు అర్జున్‌ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు తమన్‌తో పాటు, ఎంపీ సుబ్బరామిరెడ్డి, నటులు సాయి కుమార్, శ్రీకాంత్, రకుల్ ప్రీత్‌సింగ్, ‘దిల్ ’ రాజు, హరీశ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో టైటిల్ సాంగ్‌లోని ఒక బిట్‌కు అల్లు అర్జున్ వేదికపై డ్యాన్స్ చేసి, ఫ్యాన్స్‌ని అలరించారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment