-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 12, 2016

బ్యాంకు విలీనాలకు వేళాయెనా..!

 
 ♦ విలీన ప్రక్రియపై కేంద్రం కసరత్తు షురూ
♦ ఏ బ్యాంకును ఎందులో కలపాలనే బాధ్యత బ్యాంక్స్ బోర్డ్‌కు;
♦ సెప్టెంబర్ నాటికి స్పష్టత వస్తుందంటున్న బ్యాంకు ఉన్నతాధికారులు
♦ ఉద్యోగులకు షేర్లను కేటాయించడం ద్వారా బుజ్జగింపులు
♦ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనమంటూ ప్రచారం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నో ఏళ్లుగా కేవలం చర్చలకే పరిమితమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమయ్యింది. ఇందుకోసం వినోద్‌రాయ్ నేతృత్వంలో తాజాగా బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) కూడా సమావేశమయ్యింది. త్వరలోనే విలీన కార్యాచరణకు సంబంధించి బీబీబీ ఒక రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వానికి సమర్పించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు.  ఇప్పుడున్న 27 ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి... 6 నుంచి 10 బ్యాంకులుగా   మార్చవచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. మొండి బకాయిల పుణ్యమా అని అత్యధిక బ్యాంకులు నష్టాల్లోకి జారుకోవడం, లోక్‌సభలో అధికార పార్టీ పూర్తిస్థాయి మెజారిటీలో ఉండటంతో బ్యాంకుల విలీనానికి ఇదే సరైన తరుణమని, ఇప్పుడు కాకపోతే ఇక ఇది ఎప్పటికీ సాధ్యం కాదన్న ఆలోచనలో కేంద్ర ఆర్థిక శాఖ ఉంది.

ఈ మధ్యనే బ్యాంకు ఉన్నతాధికారులతో జరిగిన ‘జ్ఞాన్ సంగమ్’ సమావేశంలో బ్యాంకు విలీనాలపైనే ప్రధానంగా చర్చించారు. ఏ బ్యాంకును ఎందులో విలీనం చేస్తే బాగుంటుందనే విషయాన్ని అధ్యయనం చేసి బీబీబీ ఒక నివేదిక ఇస్తుంది. నాల్గవ త్రైమాసిక ఫలితాల తర్వాత బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనా వస్తుందని, దీని ప్రకారం ఎన్ని బ్యాంకులు మిగులుతాయనే దానిపై స్పష్టత వస్తుందని ఈ విషయాలతో నేరుగా సంబంధం ఉన్న అధికారి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. అంతేకాదు... విలీనాలను వ్యతిరేకిస్తున్న బ్యాంకు యూనియన్లను ప్రసన్నం చేసుకోవటానికి కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలీనాలపై యూనియన్ల అభిప్రాయాన్ని అడిగినట్లు ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘విలీనాల వల్ల ఉద్యోగుల తొలగింపు ఉండదని, విలీనాల తర్వాత కూడా ప్రభుత్వానికే మెజార్టీ వాటా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే భారీగా మొండి బకాయిలున్న ఐడీబీఐ బ్యాంక్‌ను మాత్రం ప్రైవేటీకరించనున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారు’’ అని సదరు ప్రతినిధి వెల్లడించారు.

 మొండి బకాయిల సాకు..: నిజానికి ‘బ్యాలెన్స్ షీట్ క్లీన్ అప్’ పేరిట పీఎస్‌యూ బ్యాంకుల చేత తప్పనిసరిగా ఎన్‌పీఏలను ప్రకటింప చేయడం వెనుక కూడా విలీనాల ఎజెండా ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ‘‘బలహీన బ్యాంకులుగా ముద్ర వేసి డిపాజిట్‌దారులు, ఉద్యోగుల రక్షణకు విలీనమే శరణ్యమని చెప్పటమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. లేకపోతే మొన్నటి వరకు ప్రభుత్వానికి భారీ డివిడెండ్లు ఇచ్చిన బ్యాంకులు ఒక్కసారిగా నష్టాల్లోకి జారడమేంటి?’’ అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత త్రైమాసికంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నాలుగైదు తప్ప మిగిలినవన్నీ నష్టాలే ప్రకటించాయి.

మార్చి 2015 నాటికి పీఎస్‌యూ బ్యాంకుల ఎన్‌పీఏలు 5.43 శాతంగా ఉంటే అదే ఏడాది డిసెంబర్ నాటికి 7.30%కి పెరిగిపోయాయి. వీటి విలువైతే రూ. 4.3 లక్షల కోట్లు. ఈ ఎన్‌పీఏల దెబ్బకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, అలహాబాద్ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోవడంతో బ్యాంకులు నడవడానికి వచ్చే మూడేళ్లలో కనీసం రూ.1.80 లక్షల కోట్ల మూలధనం కావాలని అంచనా. కానీ వచ్చే ఏడాదికి బడ్జెట్‌లో కేటాయించింది రూ. 25,000 కోట్లే. అదనపు నిధులివ్వలేమనే సాకుతో బలమైన బ్యాంకుల్లో బలహీనమైనవి విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.


ఉద్యోగులకు షేర్ల ఎర...
విలీనాలపై ఉద్యోగుల్లో మునుపటంత వ్యతిరేకత లేదు. దీన్ని తగ్గించడానికి ఆర్థికశాఖ... ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమన్న హామీని గట్టిగానే వినిపిస్తోంది. దీంతోపాటు ఉద్యోగులకు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ (ఈసాప్స్) కింద బ్యాంకు షేర్లను జారీ చేయనున్నట్లు కూడా ఆర్థికమంత్రి చెప్పారు. 27 పీఎస్‌యూ బ్యాంకుల్లో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీలీనాలతో ప్రమోషన్లు, సర్వీస్ లెక్కలు వంటి చిన్న చిన్న సమస్యలుంటాయని, వాటిని ఈజీగానే పరిష్కరించుకుంటామని యూనియన్ల నాయకులు చెబుతున్నారు.

మరోవంక విలీనాలపై ఆర్థికశాఖ నుంచి లీకులు కూడా వెలువడుతున్నాయి. 27 బ్యాంకుల్ని 6 బ్యాంకులుగా కుదిస్తారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులన్నీ చట్ట సవరణ ద్వారా ఒకేసారి విలీనం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే అనుబంధ బ్యాంకుల విలీనంపై ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదని, సెప్టెంబర్ తర్వాత దీనిపై స్పష్టత రావచ్చని ఎస్‌బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ చెప్పారు. విలీనం వల్ల లాభమా నష్టమా అనేది నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి భవిష్యత్తులో తెలుస్తుందన్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu