-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 01, 2016

వెరైటీగా స్పందించిన ధోని


ముంబై: తన రిటైర్మెంట్ పై విదేశీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని విభిన్నంగా స్పందించాడు. విండీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని విలేకరులతో మాట్లాడుతుండగా ఆస్ట్రేలియా జర్నలిస్ట్ శామ్యూల్స్ ఫెర్సిస్ ఈ ప్రశ్న వేశాడు. వెంటనే స్పందించిన ధోని అతడిని తన పక్కన కూర్చోమని కుర్చీ చూపిస్తూ వేదికపైకి ఆహ్వానించాడు.

అతడు కుర్చీలో కూర్చొగానే భుజంపై చేయి వేసి సరదాగా ఎదురు ప్రశ్నలు వేశాడు. నేను రిటైర్ కావాలని కోరుకుంటున్నావా అని ప్రశ్నించాడు. 'నో నేను కోరుకోవడం లేదు. రిటైర్మెంట్ పై మీరేం చెబుతారో వినాలనుకుంటున్నా' అని ఫెర్సిస్ సమాధానం ఇచ్చాడు. 'భారత జర్నలిస్టులు ఎవరైనా ఈ ప్రశ్న వేసుకుంటే మీ కొడుకు లేదా తమ్ముడెవరైనా వికెట్ కీపర్ గా ఉన్నారా అని అడిగేవాడిని. ఎందుకంటే నేను తప్పుకుంటే వారికి అవకాశం దక్కుతుంది కాబట్టి. కానీ నిన్ను ఆ ప్రశ్న అడగలేకపోతున్నాను. నేను ఫిట్ గా లేనని భావిస్తున్నావా, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం లేదా' అని ధోని ప్రశ్నించాడు. 'నో.. నువ్వు చాలా వేగంగా పరుగెడుతున్నావు' అని ఫెర్రిస్ జవాబిచ్చాడు.

'2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడలేనని భావిస్తున్నావా' అని మళ్లీ ధోని ప్రశ్నించగా 'అదేమి లేదంటూ' ఫెర్రిస్ బదులిచ్చాడు. 'నీ ప్రశ్నకు నువ్వే  సమాధానం ఇచ్చావు' అంటూ మిస్టర్ కూల్' అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu