వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ సమయంలో పిల్లలకు ఇండోర్‌గేమ్స్ ఆడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించే వెబ్‌సైట్లు, యాప్స్‌ను పిల్లలకు అందించడం ద్వారా వారిలో క్రియేటివిటీ
పెరిగేలా చే యాలి. కొత్త కొత్త అంశాలు, ఆటల గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలి. అలాంటి కొన్ని యాప్స్, వెబ్‌సైట్ల వివరాలు ఇవి...
యానీవరల్డ్ లైట్
ఒకటి నుంచి ఐదేళ్ల మధ్యనున్న పిల్లలకు ఉద్దేశించిన యాప్ ఇది. ఈ వయసులో పిల్లలు జంతువుల పేర్లు, అవి తీసుకునే ఆహారం వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. జంతువుల సమాచారాన్ని పిల్లలు సంతోషంగా నేర్చుకోవడానికి ఈ యాప్ దోహదపడుతుంది. వివిధ రకాల జంతువులు, అవి తీసుకునే ఆహారాన్ని పిల్లలకు చక్కగా వివరించవచ్చు. ఇందులో జంగిల్, ఫామ్, పెట్స్ అని మూడు గ్రూపులుంటాయి. పిల్లలు ఆసక్తిని బట్టి ఎంచుకోవచ్చు. 36 రకాల జంతువుల అరుపులను వినొచ్చు. వాటితో ఆడుకోవచ్చు. ఎనిమల్ హోమ్‌పై క్లిక్ చేయడం ద్వారా జంతువులు ఎక్కడ నిద్రపోతాయో కనుక్కోవచ్చు. జంతువులు రాత్రివేళ నిద్రపోతున్న సమయంలో ఎలాంటి శబ్దాలు చేస్తాయో స్పష్టంగా వినొచ్చు. ఫీడ్ మి సెక్షన్‌లో మూడు రకాల ఆహారం ఉంటుంది. ఏ ఆహారం ఏ జంతువు తింటుందో సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్‌గా సెలక్ట్ చేసినపుడు స్ర్కీన్‌పై ఆ జంతువు ఆహారం తినడం ప్రారంభిస్తుంది. ఒక్కో జంతువు ఎదుగుదల ఎలా ఉంటుందో కూడా పిల్లలు చూడొచ్చు. జంతువుల గురించి నేర్చుకోవడానికి పిల్లలకు ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది.
ఐస్టోరీ బుక్స్
ఎంటర్‌టైనింగ్ కోరుకునే పిల్లలకు ఈ యాప్ బెస్ట్ ఆప్షన్. ఇది పిల్లల్లో కథలు చదివే అలవాటు పెరిగేలా చేస్తుంది. ప్రతి కథ అద్భుతమైన బొమ్మలతో ఉంటుంది. కంప్లీట్ వాయిస్ ఓవర్, బొమ్మలు, ప్రత్యామ్నాయం భాషలతో ఉచితంగా పుస్తకాలు చదువుకోవచ్చు. సింపుల్ కానీ స్వీట్ యాప్. 11 పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ప్రతి రెండు వారాలకు ఒక కొత్త పుస్తకం యాడ్ అవుతుంది. అకడమిక్ పుస్తకాలతో పాటు మైథాలజీ బుక్స్ అందుబాటులో ఉంటాయి. పిల్లలు పుస్తకాన్ని ఎంజాయ్ చేస్తూ చదివేలా చేస్తుంది. ఈ వేసవిలో పిల్లలకు పుస్తక పరిజ్ఞానం పెరగాలంటే ఈ బుక్స్ అందుబాటులో ఉంచండి.
వర్చువల్ ప్లే
పిల్లలకు వర్చవల్ ప్లే గ్రౌండ్ అనుభవం కావాలంటే ‘టొకా బ్లాక్స్’ని ఎంచుకోవాలి. వర్చువల్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు క్రియేటివిటీకి పదును పెరుగుతుంది. ప్లేయర్స్ రకరకాల బ్లాక్స్‌ని ఎంచుకుని కొత్త బ్లాక్స్ లేక ఆబ్జెక్ట్స్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. పిల్లలు చేసిన న్యూబ్లాక్ సేవ్ అయి ఉంటుంది. రకరకాల మార్గాల్లో బ్లాక్స్ నిర్మించడానికి, మీ మెదడు శక్తిని పెంచడానికి ఇది ఉపకరిస్తుంది. గేమ్స్‌ను ఇష్టపడే పిల్లలకు ఇది బాగా ఉపకరిస్తుంది.
మ్యాథ్స్ సులభంగా..
పిల్లలు నంబర్స్ నేర్చుకోవడానికి ‘కిడ్స్ నంబర్స్ అండ్ మాథ్స్’ యాప్ బాగా పనికొస్తుంది. దీని సహాయంతో పిల్లలు ఆడుతూ పాడుతూ నంబర్స్ నేర్చుకుంటారు. నంబర్లు కౌంట్ చేయడం, ప్లస్, మైనస్, కంపేర్ చేయడం, మ్యాచింగ్ వంటివన్నీ పిల్లలు నేర్చుకోవచ్చు. పిల్లలకు ఆల్జీబ్రా నేర్పుతున్నట్లయితే డ్రాగన్ బాక్స్ ఆల్జీబ్రా 5+ బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఐదేళ్ల పైవయసున్న పిల్లల కోసం డిజెన్ చేసింది. సింపుల్ లాజిక్ పజిల్స్‌ను పూర్తి చేయడం ద్వారా పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది. మొత్తం 200 పజిల్స్ ఉంటాయి. అడిషన్, డివిజన్, మల్టిప్లికేషన్ కవర్ అవుతాయి. మ్యాథ్స్ భయం పోవడానికి బాగా ఉపకరించే యాప్ ఇది.
చిల్డ్రన్ జోన్
మ్యూజిక్, మూవీస్, జోక్స్, ఆటలు, దినఫలాలు, ఈకార్డ్స్, స్టడీ జోన్, జంతువుల సమాచారం, వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్, డిక్షనరీ, ఎన్‌సైక్లోపీడియా వంటివన్నీ లభించే చోటు ‘యాహూ కిడ్స్’. పిల్లలు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ యాహూకిడ్స్‌లో లభిస్తుంది. చైల్డ్ ఫ్రెండ్లీ సెర్చ్ ఇంజన్ ఇది. పిల్లలు ఈ వెబ్‌సైట్‌లో తమకు నచ్చిన అంశాన్ని వెతికి పట్టుకోవచ్చు. పిల్లలు చూసే వాటిని ఒకసారి చెక్ చేయాలనుకుంటే పేరెంట్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
చుట్టూ ఏం జరుగుతోంది?
ప్రపంచంలో వింతలు, విశేషాలు తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లలకు ఉంటుంది. అలాంటి వారికి ‘నేషనల్ జియోగ్రఫిక్‌కిడ్స్’ వెబ్‌సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషనల్ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఎనిమల్స్, యాక్టివిటీస్, స్టోరీస్, ఇతర ఎడ్యుకేషనల్ లింక్స్ ఉంటాయి. పిల్లల ఐక్యూ పెరగడానికి దోహదపడే వెబ్‌సైట్ ఇది. ఈ వేసవిలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పిల్లల నాలెడ్జ్ పెరగాలంటే ఈ వెబ్‌సైట్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.
లెర్నింగ్ విత ఫన్
విజ్ఞానంతో పాటు వినోదం కావాలంటే ‘ఫన్‌బ్రెయిన్’ వెబ్‌సైట్‌ను పిల్లలకు చూపించాలి. ఇందులో ఇంటరాక్టివ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రామర్ గొరిల్లాస్, మ్యాథ్స్ బేస్‌బాల్ వంటి గేమ్స్ ఆడుకుంటూ పిల్లలు నేర్చుకుంటారు. వెబ్ బుక్స్, కామిక్స్ కావలసినంత వినోదాన్ని అందిస్తాయి. ఒకేరకమైన ఆసక్తులు ఉన్న వారు, ఒకే ఏజ్‌గ్రూ్‌పలో ఉన్న వారితో బ్లాగ్స్‌లో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పిల్లల తెలివితేటలు పెంచాలనుకుంటే ‘ఫన్‌బ్రెయిన్’ను అందివ్వండి.
మెదడుకు పదును
సమాచారం ఆన్‌లైన్‌లో షేర్ చేసుకోవడం తెలిసిందే. పిల్లలు రాసే చిన్న కథలు, సింపుల్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్, లేటెస్ట్ డ్రాయింగ్స్‌ను ఆన్‌లైన్ కమ్యునిటీలో షేర్ చేసుకోవాలంటే ‘హైలైట్స్ కిడ్స్’ వేదికగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు, స్నేహితుల సహాయంతో పిల్లలు షేర్ చేసుకోవచ్చు. కాంప్లెక్స్ సైంటిఫిక్ ప్రశ్నలకు సులభమైన రీతిలో సమాధానం కావాలంటే ‘లారెన్న్ హాల్ ఆఫ్ సైన్స్’ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. ఒకవేళ పిల్లలకు ఏదైనా ఇష్టమైన సబ్జెక్ట్ కనిపిస్తే లింక్‌పై క్లిక్ చేసి ఆ టాపిక్‌కు సంబంధిచిన వివరాలను తెలుసుకోవచ్చు. గేమ్స్, ఎక్స్‌పరిమెంట్స్, యాక్టివిటీస్ ఇందులో లోడెడ్‌గా కనిపిస్తాయి. ఈ వెబ్‌సైట్లు వేసవిలో పిల్లలకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తాయనడంలో సందేహం లేదు కదూ.
వెబ్‌సైట్లు
static.lawrencehallofscience.org/kidsite/
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment