బెర్రీస్, యాపిల్స్, ద్రాక్ష పళ్లు బాగా తినండి...ఎందుకంటారా...ఇవి కేన్సర్ నిరోధకాలట. అలాగే వెల్లుల్లి, అల్లం లాంటివి కూడా కేన్సర్ని నిరోధించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయిట. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ద్రాక్ష: ద్రాక్ష, ద్రాక్షరసం రెండింటిలో రెస్వెరాట్రోల్ పుష్కలంగా ఉంటుంది. ఇది నేచురల్ ఫైటోకెమికల్. శాస్త్రవేత్తలు చేసిన లేబొరెటరీ అధ్యయనాల్లో రెస్వెరాట్రోల్ కణాల్లో కేన్సర్ వృద్ధికాకుండా అడ్డుకుంటుందని తేలింది. కేన్సర్ కణాల పెరుగుదలను కూడా రెస్వెరాట్రోల్ అడ్డుకుంటుంది.
యాపిల్: ఈ పండు మీదున్న తొక్కలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్ కణాల మీద ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయి. బ్రెస్ట్కేన్సర్ని అడ్డుకోవడంలో ఇవి బాగా పనిచేస్తాయి.
వెల్లుల్లి: గాస్ట్రో ఇంటస్టైనల్ కేన్సర్ నివారణకు వెల్లుల్లి ఎంతో బాగా పనిచేస్తుంది.
పసుపు: దీంతో కేన్సర్ కణాలు వృద్ధిచెందవు. చుట్టుపక్కల శరీరభాగాలకు వ్యాపించవు.
ఆకుకూరలు: వీటిల్లో సల్ఫోరాఫాన్ అనే యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తినేటప్పుడు ఇవి విడుదలవుతాయి. ఇవి పెద్దప్రేవు, ప్రొస్టేట్ కేన్సర్లను అడ్డుకుంటాయి.
బెర్రీస్: కేన్సర్ని ఎదుర్కోవడంలో బ్లూబెర్రీస్, సా్ట్రబెర్రీస్, రెస్పెబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.
గ్రీన్ అండ్ బ్లాక్ టీ: వీటిల్లో కేంప్ఫెరాల్ అనే యాంటాక్సిడెంట్ ఉంది. ఇది రొమ్ము కేన్సర్ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తుంది. వీటిని ఇంట్లోనే తయారుచేసుకుని తాగితే మంచిది.
టొమాటోలు: వీటిల్లో లైకోపెనె యాంటాక్సిడెంట్ ఉంది. ఇది ప్రోస్టేట్ కేన్సర్ మీద బాగా పనిచేస్తుంది. సప్లిమెంట్ల ద్వారా కాకుండా ఫుడ్ ద్వారానే అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందాలి. ధాన్యాలు, పాలకూర, పల్లీలు, డ్రైడ్ బీన్స్ లేదా పీస్, తాజా కమలాల నుంచి బికాంప్లెక్స్ విటమిన్స్ పొందొచ్చు. అలాగే బాదంపాలు, చీజ్, ఆకుకూరలు, పాలకూర, బంగాళాదుపలు, ఆరంజ్ జ్యూసు, సోయా పెరుగు వంటివి తింటే విటమిన్-డి పొందుతారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment