అల్లు అర్జున్.. స్టైలిష్‌స్టార్... ఈ పేరు ఊరకనే రాలేదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. దినదిన ప్రవర్ధమానం అంటుంటారు కదా.. అదేలా ఉంటుందో అల్లు అర్జన్ని చూస్తే అర్ధమవుతుంది. అనుకున్నది సాధించడం ఓ సవాలు. అదే సాధించింది నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద సవాలు. అల్లు అర్జున్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అభిమానులంతా కలిసి అతనికి స్టైలిష్‌స్టార్ అనే బిరుదు ఇచ్చేశారు. అది చిన్న బరువు కాదు. అలాగని మోయకూడదు అనిపించే బరువూ కాదు. ప్రేక్షకుల కోసం బన్నీ ఆ బరువు మోస్తున్నాడు. ఇంకా మోస్తాడు.. మోస్తూనే ఉంటాడు. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని కోరుకుంటాడు కాబట్టి అది తప్పదు. ఎందుకని అడిగితే ‘మా మావయ్యలు అలానే చేశారు. నేనూ అలానే చేస్తా’ అంటాడు. అవును నిజమే కదా... వారసత్వం అంటే ఇంటి పేరే కాదు... ప్రేక్షకులను వాళ్లలా అలరించడం కూడా. ప్రస్తుతం బన్నీ అదే చేస్తున్నాడు.
బన్నీ మొదటి చిత్రం ‘గంగోత్రి’ విడుదలయ్యాక ‘ఇతను హీరో మెటీరియల్ కాదు’ అన్నవారే ఇప్పుడు ‘స్టైల్ ఐకాన్’ అని చెబుతున్నారు. హెయిర్ స్టైల్ నుంచి కాళ్లకు వేసుకునే షూ వరకూ ప్రతి చిన్న విషయంలోనూ జాగ్త్రత తీసుకుంటాడు. డాన్స్ విషయానికొస్తే బన్నీ ఎనర్జీకి ఫ్లోర్ సైతం భయపడాల్సిందే. ఇక తన సరసన నటించే నాయికలైతే బన్నీతో స్టెప్పులా... ఆ జోరు మేం తట్టుకోలేం బాబూ అన్న నాయికలే ఎక్కువ. ఇవే కాదు గోన గన్నారెడ్డి వంటి పాత్రల్లో యాస, భాషలోనూ తన ప్రతిభ చూపించాడు. స్టైలిష్ యాక్టింగ్, డాన్స్‌లతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళలో కూడా స్టార్‌గా ఎదిగి 13 ఏళ్లగా స్టైలిష్‌స్టార్‌గా అభిమానుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 10న వైజాగ్ ఆర్.కె బీచ్‌లో రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. 22న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
( ఏప్రిల్ 8న హీరోగా అల్లు అర్జున్ 13వ పుట్టిన రోజు సందర్భంగా )
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment