బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు సంచలన ట్వీట్లు చేశాడు. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ(24) ఆత్మహత్యకు సంబంధించిన కథనాల నేపధ్యంలో ప్రకాష్.. ప్రియాంక చోప్రాకు సంబంధించిన కొన్ని విషయాలను ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు.
'ప్రియాంక ఇప్పుడు ఆత్మస్థైర్యంతో కనబడుతుందేమోగానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. కెరీర్ లో నిలదొక్కుకునే క్రమంలో ఆమె రెండు, మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే సమయానికి నేను ఆపగలిగానంటూ' సంచలన ట్వీట్లు చేశాడు.
ప్రియాంక మాజీ ప్రియుడు అసీమ్ మర్చంట్ తో సన్నిహితంగా ఉండేదని, ఓ సారి అతని జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని.. అప్పుడు కూడా తనే అడ్డుపడ్డానని చెప్పుకొచ్చాడు. ప్రియాంకకు అసీమ్ తల్లితో చాలా అనుబందం ఉందని, అసీమ్ తల్లి మరణించినప్పుడు కూడా ప్రియాంక బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలని చూసిందని, సమయానికి తనే ప్రియాంకను పట్టుకుని కుర్చీకి కట్టేసి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నానని ట్వీట్లలో పేర్కొన్నాడు.
కొన్నేళ్ల ముందు ప్రియాంకకు, ప్రకాష్ కు మధ్య విబేధాలు తలెత్తడంతో ఆమె అతని కాంట్రాక్టును మధ్యలోనే రద్దు చేసింది. దీనిపై అతను ముంబై కోర్టును ఆశ్రయించాడు. ఆ తరువాత ప్రియాంక తండ్రి తన కుమార్తెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఇచ్చిన కంప్లైంట్ తో ప్రకాష్ కొన్ని నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు.
ప్రియాంకతోపాటు మరికొందరి పేర్లను కూడా ట్వీట్లలో ప్రస్తావించాడు. తెర మీద వెలిగిపోతూ కనిపించే చాలామంది తారల జీవితాల్లో చీకటి కోణం ఉంటుందని, అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆదివారం ట్వీట్లతో చెలరేగిపోయాడు ప్రియాంక చోప్రా ఒకప్పటి మేనేజర్ ప్రకాష్ జాజు. ప్రకాష్ చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment