కువైట్: ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేయాల్సిన ఓ మహిళ చేయకూడని తప్పుచేసి అడ్డంగా దొరికిపోయింది. సీసీ టీవీలో అసలు విషయాన్ని గమనించిన యజమాని షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వివరాలిలా ఉన్నాయి.. కువైట్ లో ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు హౌస్ మెయిడ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమాని తనకు జ్యూస్ కావాలని అడిగాడు. ఇంతలో ఓ మహిళ జ్యూస్ తయారు చేసి ఏదో పనిమీద కాస్త పక్కకువెళ్లింది.అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మరో మహిళ యజమాని కోసం సిద్ధం చేసిన జ్యూస్ లో తన యూరిన్ ను పోసింది. ఈ దృశ్యాలు వంటింట్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనిస్తే ఆ మహిళ ఆ పనికి ముందే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఆ పుటేజ్ ఎలాగో బయటకు లీక్ అయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరింది.
మీడియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా, కెమెరాలో ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నానని యజమాని చెప్పాడు. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డ పనిమనిషి పేరు, వివరాలు వెల్లడించేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారిని మాత్రం పనివారి చేష్టలపై కన్నేసి నిఘా పెట్టాలని సూచన చేయటం విశేషం.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment