చిత్రం: ‘సర్దార్ గబ్బర్‌సింగ్’
తారాగణం: పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్, శరత్ కేల్కర్, ముఖేశ్ రుషి, అలీ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, సంజన
మాటలు: సాయిమాధవ్ బుర్రా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్,దేవిశ్రీప్రసాద్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కళ: బ్రహ్మ కడలి
కెమేరా: ఆర్థర్ ఎ. విల్సన్
ఎడిటింగ్: గౌతంరాజు
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, కథ
స్క్రీన్‌ప్లే : పవన్ కల్యాణ్
నిర్మాతలు: శరత్‌మరార్, సునీల్ లుల్లా
దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ)
నిడివి: 166 నిమిషాలు
రిలీజ్ తేదీ: ఏప్రిల్ 8
కొన్ని సినిమాలంతే! మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సంచలనమే! కొన్నేళ్ళ క్రితం ‘గబ్బర్‌సింగ్’తో, ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్స్ సాధించిన ఘనత పవన్‌కల్యాణ్‌ది. మళ్ళీ పవన్ కల్యాణ్ ఇమేజ్, ‘గబ్బర్ సింగ్’ టైటిల్, పోలీస్ పాత్ర - అన్నీ కలవడంతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆది నుంచీ వార్తల్లో విశేషమే. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా. దాదాపు 100 కోట్ల పైగా వ్యాపారమైన సినిమా.
2 వేల పైగా థియేటర్లలో రిలీజైన సినిమా. ప్రపంచంలో ఒక 23 దేశాల్లో తొట్టతొలిగా విడుదలైన తెలుగు సినిమా. అందుకే, ‘హి ఈజ్ బ్యాక్ టు డు సమ్‌థింగ్’ అనే థీమ్ సాంగ్ నిజమేననిపి స్తుంది. ఆసక్తి పెరుగుతుంది. మరి, ఈ గబ్బర్ ఆ మాట నిలబెట్టుకున్నారా? కథ ఏమిటంటే, ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్. సంస్థానం రాజు, రాణి చని పోవడంతో, దళపతి హరినారా యణ (ముఖేశ్ బుుషి) సంరక్ష ణలో యువరాణి (కాజల్ అగ ర్వాల్) పెరుగుతుంది. ఆ ప్రాంతంలోనే భైరవ్‌సింగ్ (శరత్ కేల్కర్) పెద్ద మైనింగ్ డాన్. తండ్రి (ప్రదీప్ రావత్)ని అవ మానించారని, చిన్నప్పుడే వాళ్ళ చావుకు కారణమైన మనిషి. పచ్చని పంటలు పండే గ్రామాల్ని సైతం మైనింగ్ కేంద్రాలుగా మార్చేసే క్రూరుడు.
యువరాణి కుటుంబంతో అతని వైరం, ఆ ప్రాంతంలో అతని దుర్మార్గాల నేపథ్యంలో ఆ ప్రాంతానికి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సర్దార్ గబ్బర్ సింగ్ (పవన్ కల్యాణ్)ని పోస్ట్ చేస్తారు. అక్కడకొచ్చిన సర్దార్, రాజవంశీకురాలని తెలి యకుండానే యువరాణితో ప్రేమలో పడతాడు. మరోపక్క విలన్‌తో పోరాటానికి సిద్ధమవు తాడు. ఆ తరువాత ఏం జరుగుతుందన్నది ఊహించగలిగిందే.
ట్రైలర్లలోనే కథాంశమేమిటో దాదాపు చూపించేసిన దర్శక, నిర్మాతలు ఒక రకంగా ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేశారు. ఊరు, ఊరిని పీడించే విలన్, ఆ ఊరికి ఒక యువరాణి, ఆమెకు సమస్యలు, వాటిని పరిష్కరించడా నికి వచ్చిన పోలీసు హీరో - అనగానే విషయం అర్థమవుతుంది. ఇక ఆసక్తి అల్లా ఈ కథను ఎంత ఆసక్తికరంగా చెప్పారు, ఎంత ఆహ్లాదంగా తెరపై చూపారన్నదే! దాని కోసమే రెండుమ్ముప్పావు గంటలూ ప్రేక్షకులు ఓపిగ్గా చూస్తారు. సిన్మా మొదలైన కాసేపటికే విషయం అర్థమైపోతుంది.
అప్పటి నుంచి ఐటమ్ సాంగ్‌సలా రకరకాల ఐటమ్ సీన్స్ తో కథ నడుస్తుంటుంది. హీరో, విలన్ల ఎత్తు పెయైత్తుల ఆటగా కథని నడిపిస్తే ఇంకా ఆసక్తి పెరిగేది. సినిమాను మంచి ‘యాక్షన్ ఎంటర్‌టైనర్’గా తీయాలని భావించ డంతో, సహజంగా వాటి మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రతి రెండు, మూడు సీన్లకు ఏదో ఒక ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్ శ్రమపడి జొప్పించారు. అందు కోసం సాక్షాత్తూ పవన్‌కల్యాణే ఆడారు, పాడారు, గన్ను పట్టారు, (పంచ్ డైలాగులతో) గొంతు పెంచారు.
ఒకటికి రెండు సార్లు ఆడవారిలా అభిన యిస్తూ, కులుకు ప్రదర్శించారు. అన్నయ్య చిరంజీవి అభిమానుల్ని అలరిం చేలా ఆయన వీణ స్టెప్ ఈయన వేశారు. ఇలా అన్నీ ఒక్కరే, అంతా ఒక్కరే అయి, ఆ భారంతో భుజాలు వాలిపోయేంత పనిచేశారు. రాత్రింబవళ్ళు పడ్డ ఆ శ్రమ, భారం మొత్తం తెరపై ఆయనలో తెలుస్తుంది. ఇక, తెలుగు తెరకు తొలి పరిచయమైన హిందీ టీవీ విలన్ శరత్ కేల్కర్ మంచి ఒడ్డూ పొడుగుతో బాగున్నారు. వినోదం కోసం సినిమాలో అలీ బ్యాచ్, బ్రహ్మానందం, ఊర్వశి - వగైరా చాలామందే ఉన్నారు. ముఖేశ్ ఋషి, ప్రదీప్ రావత్ లాంటి పేరున్న నటీనటులకీ కొదవ లేదు. ఐటమ్ సాంగ్‌కి రాయ్ లక్ష్మిని పెట్టారు.
ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి - నిర్మాణ విలువలు. రతన్‌పూర్ విలేజ్ సెట్ మొదలు భారీ రాజప్రాసాదాలు, గుర్రాలు, పుష్కలంగా గన్‌లతో తెర నిండుగా ఉంది. ఆర్థర్ ఎ. విల్సన్, సెకండ్ యూనిట్‌కి ఐ. ఆండ్రూ అందించిన కెమేరావర్క్ - డ్రోన్ కావ్‌ు్స సాక్షిగా బాగుంటుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగుల్లో పంచ్ కొండొ కచో, పవన్ పొలిటికల్ జీవితానికీ అన్వయించేలా సాగింది. ‘‘అరెస్ట్ చేయడమంటే ఎలర్జీ. ఎన్‌కౌంటర్ చేయడమంటే ఎనర్జీ’’ లాంటి డైలాగ్స్ ఫ్యాన్స్‌కి నచ్చుతాయి.
ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ సహా ఫస్టాఫ్ లోనే 4 పాటలొచ్చే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో ‘తౌబ తౌబ...’, ‘నీ చేపకళ్ళు...’ లాంటివి నచ్చుతాయి. రామ్ - లక్ష్మణ్‌లు కంపోజ్ చేసిన యాక్షన్ పార్‌టలో ఇంటర్వెల్ ముందు ఘట్టం, క్లైమా క్స్ ఫైట్ ఉద్విగ్నంగా అనిపిస్తాయి.
‘నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది’ అనే గబ్బర్‌సింగ్ ఆ డైలాగ్‌ను ఈ సినిమాలో మరోసారి గుర్తు చేశారు. ఫ్యాన్‌సని దృష్టిలో పెట్టుకొని లెక్కలేశారు.
‘ఎక్కడ నెగ్గాలో కాదో, ఎక్కడ తగ్గాలో తెలియాలి’ అని మరో హిట్ డైలాగ్‌ని కూడా పవన్ పునశ్చరణ చేశారు. అయితే, నెగ్గాలంటే తగ్గాలన్నది హీరోయిజవ్‌ు హంగా మాలో మరిచిపోయారనిపిస్తుంది. ‘గబ్బర్‌సింగ్’ నుంచి బాక్సాఫీస్ ఫార్ములాగా మారిన అంత్యాక్షరిని మళ్ళీ అనివార్యంగా తానే అనుసరించారు.
మొత్తం మీద అప్పటి ‘గబ్బర్ సింగ్’ ఘన విజయం దృష్ట్యా ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తీశారు. ఇప్పుడిదీ అలరిస్తుందనే నమ్మకంతో చివరలో ‘రాజా.. సర్దార్ గబ్బర్‌సింగ్’ అనే ఎండ్ టైటిల్ వేసి, ‘కంటిన్యూస్...’ అని రాశారు. అది చూసి ఫ్యాన్స్ మాత్రం భలే సంతోషిస్తారు. ఏ హీరోకైనా అంతకు మించి కావాల్సింది ఏముంది! కథ కన్నా ఆఫర్ చేసిన ఐటమ్స్ ఎక్కువైపోయిన ఈ చిత్రం గురించి దర్శక, నిర్మాతలు ‘గన్స్... గట్స్... అండ్ లవ్’ అని ప్రకటిం చారు. ఆ పద్ధతిలోనే ఈ సినిమా ఒక్కముక్కలో- ‘సాంగ్‌స.. ఫైట్స్.. డ్యాన్స్.. అండ్... ఫైనల్లీ స్టోరీ’. హాలులో ఇవన్నీ పేలే గన్నులే!
urs freshdeals365
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment