కివి పండు: చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ పండు చూడటానికి ముదురు గోధుమ రంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకు పచ్చ లేదా లేత పసుపు పచ్చ గుజ్జు కలిగివుంటుంది. కమలా పండుకు రెట్టింపు 'విటమిన్ సి', ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం.
న్యూజిలాండ్ ఇటలీ, ఆస్ట్రేలియా దేశాల్లోమాత్రమే పండే కివీలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లో కూడా విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలని భావించేవారికి కివీ పండు చాలా మంచిది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి, సువాసన కూడా కివీ సొంతం.
కివి పండుకు పేర్లు చాలా వున్నాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై రట్జర్స్ యూనివర్శిటీ కి చెందిన డా. పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులో అధిక పోషకాలుంటాయని స్టడీ తెలిపింది.
కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియి న్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోప ల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు.
ఆరోగ్య ప్రయోజనాలు :
* కివి పండులో మెండుగా విటమిన్లు, ప్లావనాయిడ్స్ , ఖనిజ లవణాలు ఉన్నాయి. రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత, వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత 36% వరకూ తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
* కాన్సర్ కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్ధము ఈ పండులో ఉన్నట్లు గుర్తించారు . ఇందులో ఉండే గ్లుటథియోన్ క్యాన్సర్ కు దారితీసే క్రమాన్ని నిరోధిస్తుందని అంటారు ఆహారనిపుణులు. శరీరము లో ఏర్పడే నైట్రేట్ ఫ్రీరాడికిల్ ప్రభావాన్ని నిరోదిస్తుంది .
* మరో అధ్యయనములో కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్ ను నిరోధిస్తుందని తేలింది.
* కివిపండులో గల అమినో యాసిడ్ ' ఆర్జినిన్" శుద్ద రక్తనాళాల్లో గట్టి పదార్ధం ఏర్పడకుండా నితోధిస్తుంది .
* కివీ పండులో అత్యధికము గా బీటా కెరోటిన్ ఉన్నందున మంచి యాంటీ ఆక్షిడెంట్ గా ఉపయోగపడును .
* కివి పండులోని ఫైటోకెమికల్ " లుటెయిన్ " ప్రోస్టేట్ గ్రంధి , కాలేయ క్యాన్సర్ లను నిరోధించును .
* కివి పండు లో ఉండే " ఇనోసిటాల్ " అనే పదార్ధము మనోవ్యాకులత చికిత్సకు ఉపయోగపడుతుంది .
* కివి పండు లోని ఫైటోకెమికల్స్ , గ్జాంతోఫిల్స్ కంటిలో శాశ్వత అంధత్వానికి దోహదము చేసే " మాక్యులార్ డిజనరేషన్" ను నివారించును .
* కివి పండులోని యాంటీఆక్షిడెంట్స్ మంచి కొలెస్టిరాల్ ను భస్మము చేయకుండా నిరోధించును .
* ఈ పండులోని " ఆర్జినిన్ , గ్లుటామిన్ " అనే రెండు అమినోయాసిడ్స్ ఎక్కువగా ఉండడమువలన గుండెకు రక్తము బాగా సరఫరా కావడానికి సహకరిస్తాయి.
* కివిపండు తొక్క లో ఉండే ఫ్లావనాయిడ్ యాంటీ ఆక్షిడెంట్ శరీరములోని ఫ్రీరాడికిల్స్ ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* కివి విత్తనాలనుండి తీసిన ఆయిల్ లో 62% ఆల్ఫాలినోలిక్ , ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రస్తుత సీజన్లో రూ.20/- నుండి రూ.30/- మధ్యలో ఈ పండు అన్ని సూపర్ మార్కెట్లలో పెద్ద పళ్ళ దుకాణాల్లో కూడా దొరుకుతుంది... మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజునుండే రోజుకో కివీ పండు తినటం మొదలు పెట్టండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment