-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 03, 2016

ఎన్టీఆర్ చేతుల మీదుగా విజయ్ సినిమా ఆడియో

freshdeals365.com

ప్రస్తుతం సౌత్ హీరోలు తమ మార్కెట్ ను పెంచుకోవడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. అందుకే తమ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేయటమే కాదు. ఆ సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల ఆడియో రిలీజ్ ను కూడా ఘనంగా నిర్వహిస్తూ స్టార్ హీరోలను ముఖ్య అతిథిలుగా ఆహ్వానిస్తున్నారు.

అదే బాటలో తమిళ హీరో విజయ్ తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఉన్న విజయ్, చాలా కాలంగా తెలుగునాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. సూర్య, విక్రమ్ లతో పాటు కార్తీ లాంటి యంగ్ హీరోలు కూడా టాలీవుడ్ లో హవా చూపిస్తుంటే విజయ్ మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా తేరిని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తేరి సినిమాను తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నాడు. తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. ఇక ఆడియో రిలీజ్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భావిస్తోంది. విజయ్, సమంతలతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ ఆడియో వేడకలో పాల్గొంటే సినిమాకు మరింత ప్రచారం లభిస్తుందని దిల్ రాజు ప్లాన్.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu