ముంబై: అభిమానుల్లో ఎన్నో అంచనాలు రేపి.. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో బోల్తాపడింది. గురువారం వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన వెస్టిండీస్ చేతిలో పరాభవాన్ని చవిచూసింది. దీంతో భారత్ ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగినా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్ మాత్రం ఆదాయం గురించి ఏమాత్రం బెంగపడటం లేదు. భారత్ వైదొలిగినప్పటికీ ఆ ప్రభావం టీవీ వాణిజ్య ప్రకటన రేట్ల మీద పడకపోవడమే ఇందుకు కారణం.
ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ధోనీసేన మొదటి మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో హోరాహోరీగా పోరాడి గెలిచింది. సెమీఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు ఇండియానే. కాబట్టి ధోనీసేన వైదొలగడంతో ఆ ప్రభావం పడుతుందని భావించారు.
అయితే, ఫైనల్ మ్యాచ్ అడ్వర్టైజ్‌మెంట్ రేట్లపై ఈ ప్రభావం పడే అవకాశం లేదు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనల స్లాట్లను ఇప్పటికే అమ్మేశారు. ఇప్పటికే చెరోసారి పొట్టి వరల్డ్ కప్ కొట్టి.. మరోసారి కప్ కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆదివారం ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు టీవీ రేటింగ్స్ ఎంతొచ్చినా.. ఎంతమంది చూసినా చూడపోయినా.. ముందే అడ్వర్టైజింగ్ స్లాట్లు అమ్ముడుపోవడంతో ఐసీసీ ఆదాయానికి మాత్రం ఢోకా లేకుండా పోయింది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment