గచ్చిబౌలిలోగల ఓ మహిళా హాస్టల్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాణి మనీష(21) ఆత్యహత్య చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి ఆమె దూకేసినట్లు పోలీసులు తెలిపారు. మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఆత్యహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా చేస్తున్నదని ఆమె డైరీలోని సమాచారాన్నిబట్టి తెలుస్తోందన్నారు. ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్యహత్య కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆమె సెల్‌ఫోన్, డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఉదయం 7:00 గంటల ప్రాంతంలో భవనం పక్కనున్న గల్లీలో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని హాస్టల్లోని ఇతర యువతులు గమనించి మేనేజర్ నరేంద్రసింగ్‌కు తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు తక్షణం సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలకు బలమైన గాయాలతో అప్పటికే ఆమె మరణించినట్లు పేర్కొన్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం... జార్ఖండ్‌కు చెందిన రాణి మనీష ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఆరు నెలల కిందట ఉద్యోగంలో చేరింది. అప్పటినుంచీ ఈ హాస్టల్లోనే ఉంటున్న ఆమె, పది రోజుల కిందట జార్ఖండ్ వెళ్లి గతనెల 25న తిరిగివచ్చింది. అయితే, సోమ-మంగళవారాల్లో ఆమె ఆఫీసుకు వెళ్లలేదని హాస్టల్ నిర్వాహకురాలు చంద్రకాంత చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం గచ్చిబౌలి స్టేషన్ నుంచి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి భద్రత, రక్షణ గురించి ఆమెతో మాట్లాడినట్లు తెలిపారు. మనీష మృతిగురించి ఆమె తల్లిదండ్రులకు తెలుపగా, బుధవారం తెల్లవారుజామున ఆమె తన పెదతండ్రితో మాట్లాడినట్లు వారు చెప్పారని నిర్వాహకురాలు తెలిపారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment