న్యూదిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లిప్‌కార్ట్ మనీ’ పేరుతో డిజిటల్ వాలెట్‌ను ప్రారంభించింది. పేమెంట్స్ కంపెనీ ఎఫ్ఎక్స్ మార్ట్ ద్వారా డిజిటల్ వాలెట్ సేవలను అందుబాటులోకి తీసకురానున్నారు. ప్రస్తుతానికి ఈ సేవలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌కు మాత్రమే. వెబ్సైట్లో కూడా ఫ్లిప్‌కార్ట్ మనీ ట్యాబ్‌ను చేర్చనున్నారు. త్వరలోనే ఫ్లిప్‌కార్ట్ ఐఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోనూ ఈ సేవలను ప్రారంభించనుంది.
ఫ్లిప్‌కార్ట్ మనీ ద్వారా సత్వర రీఫండ్స్, గిఫ్ట్‌కార్డులు, క్రెడిట్, డెబిట్ ర్డుల వివరాలు భద్రపరుచుకోవడం, ప్రీపెయిడ్ బ్యాలెన్స్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ మనీ ట్రాన్సాక్షన్స్లో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇందులో మనీ బ్యాలెన్స్ రూ.10వేల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే టాప్అప్స్ నెలకు రూ.10వేలకు మించకూడదు. ఫ్లిప్‌కార్ట్ మనీ నుంచి ఇతర బ్యాంకు ఖాతాలకు కూడా ట్రాన్సాక్షన్‌కు రూ.5వేల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే నెలకు రూ.25వేలు మించకూడదు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment