సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న యువనటుడు శరద్ కేల్కర్, ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమాలో రాక్షసుడైన భూస్వామిపాత్రలో నటిస్తున్న శరద్, తనకు ఆడిషన్ జరగకముందే, పవన్ తనను ఆ పాత్రకు ఎంపిక చేశారని చెప్పాడు. స్క్రీన్ టెస్ట్ కూడా కాకముందే తనను ఎంపిక చేయటం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని, తర్వాత ఆయనతో కలిసి నటించడం మొదలుపెట్టాక ఆ రెట్టింపయ్యిందని, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు.
ఉత్తరాదిన టీవీ సీరియల్స్ తో పాటు రామ్ లీలా, రాఖీ హ్యాండ్సమ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శరద్ కేల్కర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. సర్దార్ రిలీజ్ దగ్గర పడుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన శరద్ కేల్కర్, పవన్ తో పాటు సినిమా యూనిట్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి వివరించాడు. తొలిసారిగా తాను మహరాష్ట్రలో షూటింగ్ జరుగుతుండగా సర్దార్ టీంతో జాయిన్ అయ్యానని, దాదాపు 1000 మందితో ఆ షూటింగ్ జరగడం ఆశ్చర్యంగా అనిపించిందన్నాడు.
ఇప్పటివరకు తను కలిసి నటించినవారిలో పవన్ అందరికన్నా గొప్ప వ్యక్తి అంటూ పొగిడాడు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసి ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment