హైదరాబాద్ : అక్కడట..ఇక్కడట అంటూ వార్తలు షికార్లు చేసిన మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహ వేదిక తెలిసిపోయింది. శ్రీజ చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ తో ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ లో ఈ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటున్నారు.
అయితే పెళ్లి బెంగళూరులో చేసినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమైన వారిని మాత్రమే రిసెప్షన్ కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
Post a Comment