వేసవిలో క్రికెట్ అభిమానులకు పరుగుల వినోదాన్ని అందిస్తున్న టి-20 ప్రపంచ కప్ లో లీగ్ పోరు ముగింపు దశకు వచ్చింది. ఇక నాకౌట్ సమరానికి తెర లేవనుంది. సెమీస్ లో ఏయే జట్లు తలపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. గ్రూపు-2లో ఓటమెరుగని న్యూజిలాండ్ (8) అగ్రస్థానంతో దర్జాగా సెమీస్ చేరింది. మరో బెర్తు కోసం భారత్ (4), ఆస్ట్రేలియా (4) పోటీపడుతున్నాయి. ఈ రోజు భారత్, ఆసీస్ ల మధ్య జరిగే మ్యాచ్ విజేతకు సెమీస్ బెర్తు ఖరారవుతుంది. ఈ గ్రూపులో దాయాది పాకిస్తాన్ (2)తో పాటు బోణీ కూడా కొట్టని మరో ఉపఖండం జట్టు బంగ్లాదేశ్ (0) ఇంటిదారి పట్టాయి.
ఇక గ్రూపు-1 విషయానికొస్తే వెస్టిండీస్ (6), ఇంగ్లండ్ (6) తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్ కు దూసుకెళ్లాయి. దక్షిణాఫ్రికా (2), శ్రీలంక (2), అఫ్ఘానిస్తాన్ (0) టోర్నీ నుంచి నిష్కమించాయి. ఈ గ్రూపులో ఇంకా రెండు లీగ్ మ్యాచ్ లు జరగాల్సివున్నా నామమాత్రమైనవే. తొలి రెండు స్థానాల్లో ఉన్న విండీస్ కు మరో మ్యాచ్ ఉండగా, ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్ లు ఆడేసింది. ఈ రోజు విండీస్, అఫ్ఘాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కరీబియన్ల జోరు చూస్తే అఫ్ఘాన్ పై గెలవడం పెద్ద కష్టమేమీకాదు. ఒకవేళ ఈ మ్యాచ్ లో విండీస్ ఓడినా ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్ రేట్ ఉంది కాబట్టి అగ్రస్థానానికి ఢోకా ఉండదు. ఈ గ్రూపులో విండీస్, ఇంగ్లండ్.. తొలి, రెండో స్థానాల్లో నిలవడం దాదాపు ఖాయమే.
ఈ సమీకరణాలను గమనిస్తే సెమీస్ లో గ్రూపు-2 టాపర్, గ్రూపు-1లో రెండో స్థానంలో నిలిచిన టీమ్ అంటే కివీస్, ఇంగ్లండ్ ఆడే చాన్స్ ఉంది. మరో సెమీస్ లో గ్రూపు-1 టాప్ టీమ్, గ్రూపు-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టు అంటే వెస్డిండీస్, భారత్ లేదా ఆసీస్ తలపడే అవకాశముంది. ఈ రోజు జరిగే కీలక పోరులో భారత్ గెలిస్తే సెమీస్ లో దాదాపుగా విండీస్ ఎదురుకానుంది. నాకౌట్ మ్యాచ్ లు హోరాహోరీగా సాగే అవకాశముంది. కివీస్, విండీస్ సూపర్ ఫామ్ లో ఉన్నాయి. ఈ నెల 30, 31న సెమీస్ మ్యాచ్ లు, వచ్చే నెల 3న ఫైనల్ సమరం జరగనున్నాయి.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment