టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో మంగళవారం సందడి చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకి అవగాహన చేసేందుకు గోషామహల్ ఇనిస్టిట్యూట్ కు చేరుకున్న రకుల్ సరదాగా బైక్ నడిపి హల్ చల్ చేసింది.
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ...ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. నగర పోలీసులు చేపడుతున్న ప్రత్యేక చొరవతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని... ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్, డీసీపీ రంగనాథ్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వాహనచోదకులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్లు డీసీపీ తెలిపారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment