తగ్గుతున్న నియామకాలు...
* ఉత్పాదకత, ఆదాయం మెరుగు
* వేతనాల పెంపు ఒత్తిడి తగ్గుతోంది
* ఆటోమేషన్‌పై పెరుగుతున్న ఐటీ కంపెనీల ఆసక్తి
ముంబై: ఆటోమేషన్ కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆటోమేషన్ ద్వారా వినియోగిత రేట్లను పెంచుకోవడంపై ఐటీ కంపెనీలు దృష్టి పెడుతుండడం వల్ల ఐటీ రంగంలో కొత్త నియామకాలు తగ్గుతున్నాయని ముంబైకు చెందిన బ్రోకరేజ్ కంపెనీ సెంట్రమ్ బ్రోకింగ్ వెల్లడించింది.
ఆటోమేషన్ వల్ల వేతనాల పెంపు ఒత్తిడి కూడా తగ్గుతుండటంతో పలు ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌వైపే మొగ్గుచూపుతున్నాయని ఈ సంస్థ తాజా నివేదిక వివరించింది. ఈ విషయంలో దేశంలో సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఐదు ఐటీ కంపెనీలు గత ఏడాది స్వల్ప సంఖ్యలోనే ఉద్యోగులను తీసుకున్నాయని పేర్కొంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజంట్-ఈ ఐదు కంపెనీలు కలిసి గత ఏడాది ఇచ్చిన నికర ఉద్యోగాల సంఖ్య 77,265 మాత్రమేనని వివరించింది. ఈ కంపెనీల్లోని మొత్తం ఉద్యోగులకు గత ఏడాది జత అయిన ఉద్యోగులు 24 శాతం తక్కువని పేర్కొంది. సెంట్రమ్ బ్రోకింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం..,
* చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీ కాగ్నిజంట్ కొత్త ఉద్యోగాలను బాగా తగ్గించింది. గత ఏడాది ఈ కంపెనీ 10,200 నికర ఉద్యోగాలను మాత్రమే ఇచ్చింది. 2014తో పోల్చితే ఈ కంపెనీ నికర ఉద్యోగాల సంఖ్య 75 శాతం తగ్గింది.
* హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ విషయంలో ఈ క్షీణత 71 %గా ఉంది. టీసీఎస్‌లో ఈ క్షీణత 7%గా ఉంది.
* అయితే ఈ కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ నికరంగా 23,745 మంది ఉద్యోగులను తీసుకుంది. జత అయిన ఉద్యోగుల శాతం 111 శాతంగా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ కంపెనీలో ఆట్రీషన్(ఉద్యోగులు కంపెనీని వదిలివెళ్లడం) రేటు బాగా ఉండటంతో ఈ స్థాయిలో ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసుకుంది.
* పలు ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నికర ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది.
* పోటీ తీవ్రంగా ఉండటంతో ఆటోమేషన్ విస్తరణపై ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఆటోమేషన్ విస్తరణ కారణంగా వివిధ ప్రాజెక్టుల పనితీరు మెరుగుపడటంతో ఈ విధానాన్నే అవలంభించాలని కంపెనీలు భావిస్తున్నాయి.
* ఆటోమేషన్ వినియోగం వల్ల ఈ కంపెనీల్లో ఒక్కో ఉద్యోగి ఆదాయ ఉత్పాదకత ఏడాదికి 45,000-50,000 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆటోమేషన్ వినియోగంతో దీనిని 2020 కల్లా 80,000 డాలర్లకు పెంచుకోవాలని ఇన్ఫీ యోచిస్తోంది.
* పెద్ద ఐటీ కంపెనీలకు సొంత ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్‌లున్నాయి. ఇన్ఫోసిస్‌కు ఇన్ఫోసిస్ ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్, విప్రోకు హోమ్స్, హెచ్‌సీఎల్ టెక్‌కు డ్రై ఐస్, టీసీఎస్‌కు ఇగ్నియో పేరు తో ఈ ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్‌లున్నాయి. అయినప్పటికీ పలు స్వతంత్ర కంపెనీలు ఆటోమేషన్ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఐపీ సాఫ్ట్, బ్లూ ప్రిజ్మ్, జెన్‌ఫోర్, ఆటోమేషన్ ఏనీవేర్ వాటిల్లో కొన్ని.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment