మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు టీమిండియాను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తారు. మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందన్న దశలో.. ఆ మూడు బంతులలో మూడు వికెట్లు పడగొట్టి, కెప్టెన్సీ సామర్థ్యం అంటే ఏంటో, వ్యూహాలు ఎలా ఉంటాయో చూపించిన మహేంద్ర సింగ్ ధోనీని ఆకాశానికి ఎత్తేశారు. ట్విట్టర్ వరుసపెట్టి మోగుతూనే ఉంది. ఫేస్‌బుక్ పేజీలు నిండిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ క్రికెట్ ఫొటోలే. సోషల్ మీడియా టీమిండియాకు హారతి పట్టింది. ఈ విజయంలో పాలుపంచుకున్న క్రికెటర్లు కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత మొబైల్ ఫోన్లు పట్టుకుని తమ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఈ మ్యాచ్‌తో చాలా మజా వచ్చిందని, ఇప్పటివరకు ఇలాంటి మ్యాచ్ తనకు అనుభవంలోకి రాలేదని, అద్భుతంగా ఉందని చివరి మూడు బంతుల్లో ఒక క్యాచ్ పట్టిన శిఖర్ ధావన్ అన్నాడు. టీమ్ ఎఫర్ట్ చాలా బాగుందంటూ హిందూస్థాన్ జిందాబాద్ అని ట్వీట్ చేశాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కొంత పెద్దమనిషి తరహాలో స్పందించాడు. బంగ్లాదేశ్ కూడా చాలా అద్భుతమైన క్రికెట్ ఆడిందంటూ వాళ్లనూ ప్రశంసించాడు. చాలా అలసిపోయినట్లు అనిపిస్తోందని, అదే సమయంలో చివరి వరకు అంతా చాలా బాగా ఆడినందుకు సంతోషంగా కూడా ఉందని తన ట్వీట్‌లో వెల్లడించాడు.
ఇక సామాన్య ప్రేక్షకులు కూడా బంగ్లాదేశ్, టీమిండియాల గురించి తమదైన శైలిలో కామెంట్లు పెట్టారు. ఈ మ్యాచ్ ప్రధానంగా రెండు పాఠాలు నేర్పిస్తోందని, గెలిచేవరకు సంబరాలు చేసుకోకూడదు.. అంతా అయిపోయేవరకు వదిలిపెట్టకూడదు అనేందుకు ఈ మ్యాచే నిదర్శనమని పలువురు అన్నారు. ముఖ్యంగా ముష్ఫిఖర్ రహీమ్ ఒక ఫోర్ కొట్టగానే తాను మొత్తం మ్యాచ్ గెలిచేసినట్లు సంబరాలు చేసుకుంటున్న ఫొటోను, కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ చాలా కూల్‌గా వికెట్ల వెనక ఉన్న ఫొటోను చూపించి ఈ వ్యాఖ్యానాలు చేశారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment