బనగానపల్లి(కర్నూలు): క్రికెట్ బంతి కోసం వెళ్లిన చిన్నారి కొలాయి గుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులు ఈ రోజు ఈస్టర్ కావడంతో చర్చికి వెళ్లి వచ్చారు.
అనంతరం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో అతని నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బంతి కొలాయి గుంటలో పడటంతో.. దాని కోసం వెళ్లిన చిన్నారి గుంటలో పడిపోయాడు. గుంటలో నీళ్లు ఉండటంతో అందులో మునిగి మృతిచెందాడు. ఇది గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment