కోల్ కతా: ఈ నెల 23న భారత్ తో జరిగిన మ్యాచ్ లో తాను ఆడిన షాట్ ఆడిన తీరుపై బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీం చాలా బాధపడుతున్నాడు. తాను చాలా నిర్లక్ష్యంగా షాట్ ఆటడం వల్లే భారత్ చేతిలో ఓటమి పాలయ్యామని చెప్పాడు. జట్టు ఓటమికి తానే కారణమని తనను క్షమించాలని దేశ అభిమానులను కోరాడు. తాను ఆ విధంగా ఔట్ కాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. తాను ఔటవ్వక ముందు రెండు బంతులను బౌండరీలను తరలించిన తర్వాత ఆ ఒక్క షాట్ జట్టు ఓటమికి దారితీసిందన్నాడు. తాను డీప్ సైడ్ ఆడిన షాట్ సిక్స్ అయింటే... అది గ్రేట్ షాట్ అయి ఉండేదని, చాలా మద్ధతు లభించేందని ముష్ఫికర్ తన మనసులో మాట బయటపెట్టాడు.
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యాఖ్యలను తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశాడు. బిగ్ షాట్ ఆడి మ్యాచ్ ను ముగించాలి. అయితే ఆ సమయంలో చేతిలో వికెట్లు ఉన్నాయా, లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఆ బ్యాట్స్ మన్ ఒకవేళ ఔటయిన తర్వాత వచ్చే ఆటగాడు మ్యాచ్ ఫినిష్ చేస్తాడని భావిస్తేనే షాట్ ఆడేందుకు ప్రయత్నించాలి' అని గతంలో ధోనీ కామెంట్లను షేర్ చేశాడు. అయితే తాను ఔటైన తర్వాత తన సహచరుడు కూడా అదే తీరుగా ఆడటం కూడా ఓటమికి మరింత కారణంగా మారిందని ముష్ఫికర్ రహీం వివరణ ఇచ్చాడు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment