డమస్కస్: మధ్య సిరియాలో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదకు ఆణి ముత్యంలా విరాజిల్లుతున్న పాల్మాయ్‌రా నగరంలో ప్రాచీన కట్టడాలను ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టు ముష్కర మూకలు సమూలంగా ధ్వంసం చేశాయి. ఆనాటి సంస్కృతికి ప్రత్యక్ష తార్కాణంగా నిలిచిన సుందరమైన బాల్‌షామిన్ ఆలయాన్ని బాంబులు పెట్టి పేల్చేశారు. శిథిల సౌందర్యం కూడా కనిపించకుండా నేడక్కడ మొండి స్తంభాలు దిష్టి బొమ్మలుగా మిగిలాయి. పాల్మాయ్ నగరానికే చారిత్రక చిహ్నంగా నిలిచిన ట్రంప్ ద్వారా బంధాన్ని కూడా కూల్చివేశారని అక్కడ మ్యూజియం డెరైక్టర్‌గా ఇంతకాలం పనిచేసిన ఖలీల్ హరిరి అక్కడికి వెళ్లిన స్వీడన్ జర్నలిస్టులకు వివరించారు.
అంతేకాకుండా ప్రాచీన రాజరిక చరిత్రకు ఆనవాళ్లుగా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న సమాధులను (టూంబ్స్)ను కూడా టెర్రరిస్టులు పేల్చివేశారు. వాటిలోని రాయితో చేసిన వందలాది శవ పేటికలను కూడా ధ్వంసం చేశారు. అందమైన విగ్రహాలను చెక్కిన శిలా సాసనాల స్థూపాలను కూడా పేల్చి వేశారు. ఇంతకుముందు విలువైన విగ్రహాలను స్వాధీనం చేసుకొని వాటిని నల్లబజారులో విక్రయించేందుకు ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు ప్రాచీన సాంస్కృతిక వారసత్వ సంపదలపై దాడులు నిర్వహించగా, ఇప్పుడు పాల్మాయ్‌రా కట్టడంలో బంగారం ఉందన్న గుడ్డి నమ్మకంతో విధ్వంసం సృష్టించారు. ఎక్కడా వారికి పిసరంతా బంగారం కూడా దొరకలేదు.
వారు సృష్టించిన విధ్వంసం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఎడారిలా మారిపోయింది. టెర్రరిస్టులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నారని ముందుగానే వార్తలు అందడంతో పురావస్తు శాస్త్రవేత్తలు 2015లోనే విలువైన విగ్రహాలను, వస్తువులను వీలైనంత వరకు అక్కడి నుంచి తరలించారు. విధ్వంసం అనంతరం ప్రత్యక్షంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన స్వీడన్ జర్నలిస్టులు అక్కడి శిథిల దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీశారు.
for video click here
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment