వసూళ్లలో సంచలనాలు నమోదు చేసిన ‘బాహుబలి’ చిత్రం జాతీయ అవార్డులను సైతం దక్కించుకుని తన సత్తా చాటింది. జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రెండు అవార్డులు దక్కించుకుంది. 2015వ సంవత్సరానికి గాను 63వ జాతీయ ఫిల్మ్ అవార్డులను సోమవారం న్యూఢిల్లీలో ప్రముఖ దర్శక-నిర్మాత రమేశ్ సిప్పీ నేతత్వంలోని జ్యూరీ ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్, నాన్ ఫీచర్ ఫిల్మ్స్, సినిమాలపై రచనలు తదితర కేటగిరీల్లో ఈ పురస్కారాలను ప్రకటించారు. ‘బాహుబలి’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దక్కడంతో ఆ ఘనత దక్కిన తొలి తెలుగు సిన్మా అయింది. ఉత్తమ నిర్మాణ విలువలతో వెండితెరపై సృష్టించిన అద్భుత భావనాత్మక చిత్రంగా జ్యూరీ ఈ సినిమాని కొనియాడింది. ‘బాహుబలి’ దర్శక-నిర్మాతలకు రూ. 2.5 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శ్రీనివాస్ మోహన్‌కు రజత కమలం, రూ. 50 వేల నగదు ఇస్తారు. ప్రాంతీయ ఉత్తమ చిత్రాల్లో భాగంగా తెలుగులో ‘కంచె’ ఎంపికైంది. దర్శక- నిర్మాతలకు రజత కమలంతో పాటు చెరో లక్ష రూపాయలు నగదు అందజేస్తారు. ఇక హిందీ చిత్రం ‘బాజీరావు మస్తానీ’ 7 కేటగిరీల్లో అవార్డ్‌లు దక్కించుకోవడం విశేషం. దొడ్డహు ల్లూరు రుక్కోజీ కన్నడ రచన ‘డాక్టర్ రాజ్‌కుమార్ సమగ్రచరిత్రె’కు సినిమాపై ఉత్తమ పుస్తకం అవార్డు దక్కింది. సతీశ్‌చోప్రా రచన ‘ఫర్‌గాటెన్ మాస్టర్స్ ఆఫ్ హిందీ సినిమా’కు ప్రత్యేక ప్రశంస దక్కింది. మణిపురీ ఫిల్మ్ క్రిటిక్ మేఘచంద్ర కొంగ్‌బామ్‌కు ‘ఉత్తమ సినీ విమర్శకుడి’ అవార్డు ప్రకటించారు.
తండ్రీ కూతుళ్ల ‘పికు’
చాదస్తపు తండ్రి... అతడి చాదస్తాన్ని భరిస్తూ సహిస్తూ కూడా అతణ్ణి అమితంగా ప్రేమించే కూతురు... జీవిక కోసం ఇద్దరూ ఢిల్లీలో నివసిస్తూ ఉంటారు.... కాని తండ్రి ఆత్మ మాత్రం వాళ్ల సొంత ప్రాంతమైన కోల్‌కతాలోనే ఉంటుంది. కూతురి పెళ్లైపోతే తనను చూసుకునేది ఎవరు అని తండ్రికి ఆందోళన. తన ఈడువారంతా సెటిలవుతున్నా తనకంటూ ఒక మగతోడు ఏర్పడకపోవడం గురించి కూతురికి చికాకు... ఈ నేపథ్యం అంతా ఉంచుకొని పైకి మాత్రం ‘మలబద్ధకాన్ని’ సమస్యగా చూపి ప్రతి ప్రేక్షకుడినీ ఆలోచింప చేసిన సినిమా ‘పికు’. ఈ స్క్రిప్ట్‌ను రాసిన జుహీ చతుర్వేదీ, దర్శకుడు సుజిత్ సర్కార్ ఎంత ప్రతిభ చూపారో తన ఇమేజ్‌కు చాలా భిన్నమైన ముసలి తండ్రి పాత్రను పోషించిన అమితాబ్ అంతే ప్రతిభ చూపాడు. బెంగాలీ యాసతో కూడిన హిందీ మాట్లాడటం, నస పెట్టడానికి వాగుడుకాయలా మారడం, ‘మలబద్ధకం’ వంటి అంశాన్ని కూడా ఎబ్బెట్టుగా అనిపించకుండా అతి సామాన్యం చేసేయడం అమితాబ్ వల్లే సాధ్యమైంది. వృద్ధాప్యంలోకి వచ్చాక పెద్దవాళ్లు పిల్లలుగా మారిపోతారని, వారి చిరుచిరు కోరికలే వారికి అసలైన మనశ్శాంతని చెప్పే ఈ ‘పికు’ 2015లో వచ్చిన మేలిమి చిత్రం.
భర్తను కనుగొన్న భార్య ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’
మంచి భర్త తోడుంటే... అతడు ఎప్పుడూ భార్యను విసిగించకపోతే, భార్యను వేధించకపోతే, నిజమైన ప్రేమ కలిగి అబద్ధపు ప్రేమను నటించకపోతే ఆ భార్యకు ఆ భర్త అంటే చిన్నచూపు ఏర్పడుతుంది. కాని ఆ భర్తను కోల్పోయినప్పుడే, దూరమైనప్పుడే ఆ భర్త విలువ తెలిసి వస్తుంది. ‘తనూ వెడ్స్ మనూ’కు సీక్వెల్ ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’గా తీయడంలో అర్థం ఆ భార్య నిజమైన వైవాహిక జీవితంలో ‘రిటర్న్’ కావడంగా అర్థం చేసుకోవాలి. దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఈ సినిమాను ఉత్తర భారతదేశపు చిన్న ఊళ్ల సంస్కృతిలో భాగంగా తీయడం వల్ల ఆ సంస్కృతిలోని సూకా్ష్మంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన కంగనా రనౌత్ ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ‘హర్యాణ్వి’ అంటే హర్యాణా యాసతో హిందీని పలకడం సాధన చేయడమే కాదు పాత్రకు తగ్గ దేహభాషతో గొప్ప నటనను ప్రదర్శించింది. ఎన్ని పాశ్చాత్య పోకడలు ఎదురైనా ఎన్ని వైలు భారతదేశంలో ప్రవేశించినా ఈ నేల మీద వైవాహిక వ్యవస్థ చాలా బలంగా వేళ్లూనుకొని ఉందని మరోసారి నిరూపించిన సినిమా ‘తనూ వెడ్స్ మనూ రిటర్న్స్’.
15 ఏళ్ల కల... ‘బాజీరావ్ మస్తానీ’
‘హమ్ దిల్ దే చుకే సనమ్’.... సల్మాన్‌ఖాన్, ఐశ్వర్యారాయ్ నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్. సంజయ్‌లీలా భన్సాలీ మార్క్ ఏంటో బాలీవుడ్‌కు బాగా తెలిసొచ్చేలా చేసిన సినిమా. సల్మాన్, ఐశ్వర్యల కెమిస్ట్రీ చూశాక భన్సాలీ వాళ్లిద్దరితో ఓ గ్రేట్ హిస్టారికల్ రొమాంటిక్ మూవీ తీయాలనిపించింది. అదే ‘బాజీరావ్ మస్తానీ’. కథ అంతా అనుకున్నాక షాకింగ్ న్యూస్. సల్మాన్-ఐశ్వర్యల మధ్య ప్రేమ విఫలమై ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. అరే... గోల్డెన్ ఛాన్స్ మిస్. అలాంటి పెయిర్ దొరికినప్పుడే ఈ సినిమా చేద్దాం. 15 ఏళ్ల తర్వాత భన్సాలీకి రణ్‌వీర్‌సింగ్ తగిలాడు. రణ్‌వీర్‌తో దీపికా పదుకొనేకి ఉన్న సమ్‌థింగ్ సమ్‌థింగ్ గురించి అతనికి బాగా తెలుసు. అందుకే వీళ్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతుందని అర్థమైపోయింది. వీళ్లిద్దరికీ తోడు ప్రియాంకా చోప్రా. ఈ ముగ్గుర్నీ పెట్టుకుని సిల్వర్‌స్క్రీన్ మీద బ్యూటిఫుల్ రొమాంటిక్ ప్రొయిట్రీ రాయడం మొదలపెట్టాడు. అదే ‘బాజీరావ్ మస్తానీ’. కథలో అంత గొప్పదనం ఉందో లేదో తెలీదు గానీ, భన్సాలీ దీనిని తీసిన విధానమే సూపర్బ్. కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచి డ్యాన్సుల వరకూ... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మొదలుకొని విజువల్స్ వరకూ భన్సాలీ మేజిక్ వర్కవుట్ అయింది. అందుకే నేషనల్ అవార్డు జ్యూరీ మారు మాట్లాడకుండా ఆయనకు బెస్ట్ డెరైక్టర్ ప్రకటించేసింది. భన్సాలీ 15 ఏళ్ల కల చూశారా.... ఎంత పని చేసిందో? కలల్ని నిజం చేసుకోవాలన్న భన్సాలీ సంకల్పానికి నేషనల్ అవార్డు ‘సాహో’ అంది.
ఇది ఎప్పుడూ అతి పెద్ద సవాలే
‘బాహుబలి’తో విజువల్ ఎఫెక్ట్స్‌కు నేషనల్ అవార్‌డ అందుకున్న శ్రీనివాస్ మోహన్ మన అచ్చతెలుగు వాడే. ఇప్పటికి 20 ఏళ్ళ పైగా ఈ రంగంలో కృషి చేస్తూ, చెన్నైలో దక్షిణ భారతీయ భాషాచిత్రాలెన్నిటికో పని చేస్తున్న ఘనుడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘రోబో 2.0’ పనిలో ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, వడ్లమూడి శ్రీనివాస్ మురళీ మోహన్ పంచుకున్న స్పందన, అభిప్రాయాల నుంచి ముఖ్యాంశాలు.
విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నాకిది నాలుగో జాతీయ అవార్డు. గతంలో ‘మ్యాజిక్ మ్యాజిక్’ (2006), రజనీకాంత్ ‘శివాజీ’ (2007), ‘యంతిరన్’ (తెలుగులో ‘రోబో’- 2010) చిత్రాలకు వచ్చాయి. అయితే, ఇప్పటి దాకా నేను చేసిన సినిమాలన్నిటిలోకీ ఈ ‘బాహుబలి’ చాలా ప్రత్యేకం. గతంలో శంకర్ లాంటి సుప్రసిద్ధ దర్శకులతో పనిచేసినా, రాజమౌళితో చేయడం ఇదే ఫస్ట్‌టైవ్‌ు. తెలుగు సినిమాకు తొలిసారి బెస్ట్ ఫిల్మ్ అవార్‌డ రావడం, అందులో విజువల్ ఎఫెక్ట్స్ (వి.ఎఫ్.ఎక్స్)తో నాకూ ఒక పాత్ర ఉండడం నా అదృష్టం.
నిజానికిది నా ఒక్కడి ఘనత కాదు. రాజమౌళి సారథ్యంలో అన్ని విభా గాల వారూ చేసిన అద్భుతమైన టీవ్‌ు ఎఫర్‌టకు దక్కిన పురస్కారం. క్రియేటివ్ అంశాలే తప్ప, ఇతర విషయాల బాదరబందీలేవీ మాకు లేకుండా అన్నీ తల కెత్తుకొని, అసిస్టెంట్ డెరైక్టర్‌లా పనిచేసిన నిర్మాత శోభూకు ప్రత్యేక థ్యాంక్స్. ప్రొడక్షన్ డిజైనర్, కెమేరా, సంగీతం, కాస్ట్యూవ్‌ు్స - ఇలా చాలామందికి నేషనల్ అవార్‌డ్స రావాల్సింది. రానందుకు నేను కొద్దిగా నిరాశ పడ్డాను.
నేను శంకర్ ‘ఐ’ సిన్మా పని చివర్లో ఉండగా, రాజమౌళి ‘బాహుబలి’ కథ చెప్పారు. ఎగ్జయిట్ అయ్యా. ఆయన విజన్ అంతా ముందుగా ‘కాన్సెప్ట్ ఆర్‌ట’ అంటే అచ్చం ఫోటోలా ఉండే డీటైల్డ్ కలర్ పెయింటింగ్‌స అనుకోండి. ఒక్క ఈ ప్రీ-ప్రొడక్షన్ వర్‌కకే ఏడాది నుంచి ఏణ్ణర్ధం పనిచేశాం.
ప్రొడక్షన్ డిజైనర్ సాబూ శిరిల్, కెమేరా సెంథిల్, మ్యూజిక్ కీరవాణి, కాస్ట్యూవ్‌ు్స రమ గారు - ఇలా అందరం కూర్చొని చర్చించుకొనేవాళ్ళం. ఆకాశం నుంచి దూకే లాంటి జలపాతం కావాలంటే, అందుబాటులో ఉన్నంత వరకు భారీ జలపాతం దగ్గర షూటింగ్ జరిపి, మిగతాదంతా గ్రాఫిక్స్‌లో సృష్టించాం. అలాగే, రానా చేసే బుల్‌ఫైట్, వార్ సీన్లు - అన్నీ.
గ్రాఫిక్స్‌లో చేసినా కూడా రియల్‌గా అనిపించాలి. జనం నిజమని నమ్మేలా గ్రాఫిక్స్‌ను తీర్చిదిద్దడం ఈ రంగంలో ఎప్పుడూ ఉండే పెనుసవాల్. ‘బాహు బలి’లో నాకు చాలా క్లిష్టంగా అనిపించినవి ఆకాశం నుంచి దూకుతున్న ట్లుండే జలపాతాన్ని సృష్టించడం, ఆ తర్వాత సంక్లిష్టమైనవి యుద్ధ ఘట్టాలు. బయటకు తెలీకపోయినా ‘బాహుబలి’లో 90 శాతం సిన్మాలో వి.ఎఫ్.ఎక్స్ ఉన్నాయి. వీటికి పనిచేసిన 13 వి.ఎఫ్.ఎక్స్ స్టూడియోల్లో 10 హైదరాబాద్ లోవే. 90 శాతం పని ఇక్కడ చేసిందే. ఇది మనం ఆనందించాల్సిన విషయం.
ఇండియన్ సినిమా బడ్జెట్‌లో 80-90 శాతం హాలీవుడ్ స్థాయి క్వాలిటీ ఇవ్వడమనే ఛాలెంజ్ మాది. కానీ, అదో కిక్. ‘బాహుబలి’ నిజానికి ఒకే పార్‌ట. తీరా 2 పార్‌టలైంది. రెండోదానిలోనూ 40 శాతం వర్‌క చేశా. ‘రోబో2’కి ఒప్పు కోవడం వల్ల ‘బాహుబలి2’కి చేయలేకపోవడం బాధగానే ఉంది. ‘మగధీర’, ‘ఈగ’ చేసిన మా గురువు కమల్‌కణ్ణన్ చేస్తుంటే, బైట నుంచి సహకరిస్తున్నా.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment