-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

March 06, 2016

మా ప్రభాస్‌కి ఆసక్తి బాగా ఎక్కువ...?

freshdeals365.com


పెదనాన్న భక్త కన్నప్ప

‘రెబల్‌స్టార్’ కృష్ణంరాజుకు యాక్టర్‌గా 50 ఏళ్ళు. ఆయన చేసిన ‘భక్త కన్నప్ప’కు 40 ఏళ్ళు.ఏళ్ళు గడిచాయే కానీ, వన్నె తగ్గని నటన ఆయనది... ఏటా శివరాత్రి అంటే మోగే పాటలు ‘భక్త కన్నప్ప’వి. పెదనాన్న అన్నా... కన్నప్ప సినిమా అన్నా...
‘యంగ్ రెబల్‌స్టార్’ ప్రభాస్‌కు ప్రాణం. ఈ క్లాసిక్‌ను ప్రభాస్‌తో మళ్ళీ తీయాలని పెదనాన్న... ఆయన కంటివెలుగుగా ఈ సినిమాతో మరో వండర్ చేయాలని ప్రభాస్... ఇద్దరూ ఫిక్స్. ‘బాహుబలి2’ తర్వాత వీలుచూసి చేయాలని ప్లాన్. ఆలోగా... శివరాత్రి వేళ కృష్ణంరాజు సాక్షి ఫ్యామిలీకి చెప్పిన అప్పటి ‘భక్త కన్నప్ప’ మేకింగ్ ముచ్చట్లు... ఈ వారం ‘స్టార్ టాక్’.

‘కన్నప్ప’ పాత్ర చేయాలని మా ప్రభాస్‌కి చాలా ఆసక్తి. కొన్నాళ్లక్రితం దానిపై వర్‌‌క కూడా చేశాం. బడ్జెట్ ఎక్కువవుతుందని ఆగాం. ఇప్పుడు ‘బాహుబలి’ విజయంతో మాకా భయం లేదు. ఆ సిన్మాలో శివలింగాన్ని భుజానికెత్తుకొని ప్రభాస్ వస్తుంటే, విదేశాల్లోనూ జై కొట్టారు. అదీ శివుడి గొప్పతనం. రేపు ప్రభాస్‌తో తీసే ‘భక్త కన్నప్ప’ కూడా ఆ స్థాయిలో తీయాలని మా ప్లాన్. ఇంకా చాలా మంది ఈ కథను తెరకెక్కిస్తారన్నట్లు వార్తలు వస్తు న్నాయి. కానీ, ఎవరెన్ని చేసినా - నా స్క్రిప్ట్, మా వాడు చేస్తే దాని లుక్కే వేరు. ‘బాహుబలి2’ తర్వాత ఒక లవ్‌స్టోరీ, ఆ వెంటనే ‘కన్నప్ప’ చేస్తాం. అందులో క్లైమాక్స్‌లో 14 భువనాలూ కదిలే సీన్ లాంటివెన్నో ఉంటాయి.

జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎవరో రచయిత అన్నట్లు... జరుగుతున్నప్పుడు అది అద్భుతమని గుర్తించలేం! జరిగిపోయాక మనం గుర్తించాల్సిన పని లేదు! చరిత్రలో జనమే గుర్తుపెట్టుకుంటారు!!‘భక్త కన్నప్ప’ విషయంలో జరిగింది అదే!

కాళహస్తిలో... కన్నప్ప గుడి దోవలో...
మంచి సినిమా తీయాలనుకున్నా. కష్టపడి తీశాం. రిలీజయ్యాక (1976 మే 29) అది కళాఖండంగా గుర్తుండిపోయింది. ‘‘ముక్కంటి దేవరకు కన్నుల విందు చేసిన తిన్నడి కథ’’ అది. జనంలో భాగమైన కథతో సినిమా తీస్తే ఆ సినిమా జనంలో భాగమైపోయింది. శివభక్తుడైన తిన్నడి (కన్నులను దేవుడికి అర్పించాడు గనక ‘కన్నప్ప’) కథ ‘భక్త కన్నప్ప’గా రిలీజైన కొన్నేళ్ళకి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి వెళ్ళా. పక్కనే కొండ మీద కన్నప్ప గుడి. ఆ దోవలో రాళ్ళ మీద, గోడల మీద వరుసగా పెయింటింగ్‌లు. ఒక పెయింటింగ్ చూసి, మా అమ్మాయిలు ‘అమ్మా! నాన్న బొమ్మ’ అన్నారు. నేను, నా శ్రీమతి అటు తిరిగి చూస్తే... ముక్కంటీశ్వరునికి కన్నులు అర్పిస్తున్న ‘భక్త కన్నప్ప’గా నా బొమ్మ! ‘కన్నప్ప’ వేషం వేసినందుకు సాక్షాత్తూ శ్రీకాళహస్తీశ్వరుడి చెంతనే నా బొమ్మ! నటుడిగా అంతకన్నా ఇంకేం కావాలి!

‘బెన్‌హర్’, ‘టెన్ కమాండ్‌మెంట్స్’ లాగా..!
అసలు ఆ సినిమా తీయడానికి దారి తీసిన పరిస్థితులు కూడా చిత్రమైనవి. నాకెప్పుడూ ట్రెండ్ సెట్టర్స్ తీయడం అలవాటు. కెరీర్ మొదలైన ఎనిమిదేళ్ళకే భాగస్వాములతో కలసి, స్వీయ నిర్మాణ సంస్థ ‘గోపీకృష్ణా మూవీస్’లో తొలి ప్రయత్నంగా‘కృష్ణవేణి’ తీశా. యాంటీ సెంటిమెంట్‌తో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్. ఆ ఊపులో పురాణకథను విభిన్నంగా చూపిస్తే ఎందుకు చూడరని సవాల్‌గా చేసిన సినిమా ‘భక్త కన్నప్ప’. స్త్రీలు, వృద్ధులే తప్ప యువకులు పురాణ ఇతివృత్తమున్న సిన్మా ల్ని చూడరనుకొనేవారు. కానీ చూస్తారని పట్టుబట్టి తీశా. సినిమా స్టార్ట్ చేయకముందే సవాలు విసిరా. ‘బెన్‌హర్’, ‘టెన్ కమాండ్‌మెంట్స్’ కుర్రాడిగా చాలాసార్లు చూశా! అలాంటి సినిమా మనమూ తీయాలని నా ఆలోచన!

‘కమ్యూనిస్ట్ కన్నప్ప’ వద్దని... భక్త కన్నప్ప!
మొదట మధుసూదనరావు దర్శకత్వంలో అనుకున్న స్క్రిప్ట్‌ను అంతా ‘కమ్యూనిస్ట్ కన్నప్ప’ అన్నారు. దాన్ని బాపు-రమణలు మార్చి, ‘భక్త కన్నప్ప’గా తీర్చిదిద్దారు. సినిమా మొదట్లో అర్జునుడు పాశుపతాస్త్రం సాధించే ‘కిరాతార్జునీయం’ పాట ఘట్టం లాంటివన్నీ చేర్చారు. సూపర్‌హిట్ పాట ‘శివ శివ శంకరా...’ ట్యూన్ ఆదినారాయణరావు కంపోజ్ చేశారు. తర్వాత ఆయన తప్పుకోవడంతో, అసిస్టెంట్ సత్యం గారిని మ్యూజిక్ డెరైక్టర్‌గా పెట్టుకున్నాం. ఆరుద్ర, సినా రెతో పాటు, దర్శకులు కె. విశ్వనాథ్ ద్వారా వేటూరి గారి విద్వత్తు విని, ఆయనతోనూ పాటలు రాయించుకున్నాం. ఆయన ఎంతో అద్భుతంగా సుదీర్ఘంగా రాసిన ‘కిరాతార్జునీయం’ పాటను తగ్గించుకొని, సినిమాకు కావాల్సినంత రికార్డు చేశాం. సత్యం అద్భుతంగా ట్యూన్లు చేశారు. అలాగే, కోయగూడెం నేపథ్యంలో సినిమా కాబట్టి, పాటల కోసం అడవిలోకి వెళ్ళిపోయి అక్కడి గిరిజనులతో పాడించుకుని చాలా రీసెర్చ్ చేశాం. అలా వచ్చినవే - ‘ఎన్నియల్లో ఎన్నియల్లో సందమామా...’ లాంటి పాటలు.

‘పెద్దాయన’ లీలలెన్నో!
నిజానికి, పౌరాణికాల ఊపు క్రమంగా తగ్గుతున్న టైమ్ అది! అయితే, ‘కన్నప్ప’ సెమీ పురాణిక్, సెమీ ఫోక్, సెమీ సోషల్ సినిమా. కైలాసం షాట్స్ మినహా మొత్తం బుట్టాయగూడెం, పట్టిసీమ, గూటాల పరిసరాల్లోనే ఔట్‌డోర్ షూటింగ్. కరాటం కృష్ణమూర్తి, చంద్రయ్య లాంటి అక్కడి పెద్దలెంతో సహకరించారు. అడవిలోకి వెళ్ళడానికి రోడ్లు వేశాం. గూడెం సెట్ వేసి, మధ్యలో 80 అడుగుల అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించాం. దాని కోసం పెద్ద పెద్ద తాటి చెట్లను నరికేశాం. ఆ భారీ సెట్, విగ్రహం చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. వాళ్ళ మధ్య ఇబ్బంది లేకుండా షూటింగ్ ఎలా చేయాలో పాలుపోలేదు. ఇంతలో ఫస్ట్‌డేనే జనం వస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టమేమీ జరగలేదు. కానీ, జనం ‘అమ్మవారు బలి కోరుతోందిరా!’ అంటూ రావడం తగ్గించారు. ఆ ‘పెద్దాయన’ (ఈశ్వరుడు) చేసిన మేలు అది! అలా ‘ఆయన’ లీలలెన్నో!

ఎన్టీఆర్ అడిగిన క్లయిమాక్స్ ఎఫెక్ట్!
రిలీజ్ కాక ముందే సిన్మా ఎన్టీఆర్‌గారికి చూపించాం. ‘కృష్ణవేణి’ కూడా రిలీజ్‌కు ముందు ఆయనకే చూపించా. ఆయన ‘భక్త కన్నప్ప’ చూసి మెచ్చుకున్నారు. ‘క్లైమాక్స్‌లో బాణంతో కన్నప్ప తన కళ్ళు పెకలించి, శివలింగానికి పెట్టే సీన్‌లో 14 భువనాలూ కదిలిపోయాయన్నట్లు చూపితే ఇంకా బాగుండేది’ అన్నారు. బాపు-రమణలకు ఆ విషయం తెలిసింది. కానీ ఓవర్ డ్రామా బాపు గారికి ఇష్టం లేక, మార్చలేదు. సిన్మా రిలీజైంది. ‘గొప్ప సినిమా’ అని టాక్ వచ్చింది. బాపు-రమణల వర్‌‌క, స్వామి (ఆపరే టివ్ కెమేరా ఎస్. గోపాలరెడ్డి) కెమేరా, రవికాంత్ నగా యిచ్ ట్రిక్స్, ఆ సెట్లు అన్నీ వార్తలే. ఎస్పీబీ, రామకృష్ణ, సుశీల పాటలన్నీ ఎవర్‌గ్రీన్ హిట్. వెరసి అగ్రహీరో ఎన్టీ ఆర్ గారి సినిమాల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి, 20 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ కలర్ ఫిల్మ్ సూపర్‌హిట్. ఆ రోజుల్లోనే భారీగా 25 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 6 కేంద్రాల్లో శతదినోత్సవం, హైదరాబాద్‌లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది.  

నిన్నటి ‘అయుత చండీయాగం’లోనూ...
ఇవాళ్టికీ నేను ఎక్కడికి వెళ్ళినా, ‘భక్త కన్నప్ప’ని ప్రస్తావిస్తుంటారు. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భారీయెత్తున జరిపిన ‘అయుత చండీయాగం’ చూడడానికి వెళితే, అక్కడ పండితులు ‘భక్త కన్న ప్ప’లోని ‘శివ శివ శంకర ...’ పాట పాడడం వినిపించింది. ఆ పాటతో యాగశాలంతా మారుమోగడం చూస్తే, శివభక్తుడిగా నా జన్మ ధన్యమైందనిపించింది. ఈ చిత్ర నిర్మాతైన మా తమ్ముడు (హీరో ప్రభాస్ తండ్రి యు.వి. సూర్యనారాయణరాజు) దైవికంగా ఆరేళ్ళ క్రితం 2010 ఫిబ్రవరి 12న సరిగ్గా శివరాత్రి నాడే శివైక్యం చెందాడు. నాలుగు దశాబ్దాల క్రితం, నా 36వ ఏట హీరోగా, మా తమ్ముడితో కలసి నిర్మాతగా చేసిన సాహసమిది. ఇవాళ్టికీ శివరాత్రి వస్తే టీవీలో పలకరిస్తోంది. ఇంకెన్నేళ్ళయినా నాకే కాదు, సినీ ప్రియులకీ ‘కన్నప్ప’ ఒక మరపురాని అనుభూతే!

భక్తకన్నప్ప తీసేనాటికి వాణిశ్రీ టాప్ స్టార్. అయినా ఔట్‌డోర్‌లో అందరిలో ఒకరిగా కలిసి పోయింది. పాత్ర బాగా నచ్చి, అందులో లీనమైపోయింది. అక్కడి కోయ వనితలెలా చీర సర్దుకొని కూర్చుంటారో, నిల్చుంటారో అన్నీ గమనించి, సరిగ్గా అలాగే నటించేది.
 అటవీ నేపథ్యంలో ఈ షూటింగ్‌కి వెళ్ళినప్పుడు నిజంగా కోయవాళ్ళతో ఆడించాం. పాడించాం. ‘ఎన్నియల్లో...’ పాట అలా వచ్చిందే. కోయలు చిన్న డ్రవ్‌ుపై నిల్చొని, ఆడుతుంటే, పెద్ద ఢంకాల మీద నిలబెట్టి, డ్యాన్‌‌స చేయిస్తే బాగుంటుందని, ‘కండ గెలిచింది...’ అనే డ్రవ్‌ుడ్యాన్‌‌స పాట ప్లాన్ చేశాం. సామా నంతా రాజమండ్రి తీసుకెళ్ళి, ఆర్‌‌ట భాస్కరరాజు వందల్లో భారీ భేరీవాద్యాలు చేయించారు. వందల డ్యాన్సర్‌‌స కావాలి. చెన్నై వాళ్ళుచాలక, స్థానికుల్నీ తీసుకున్నాం. తక్కువ ఖర్చుకే ఎక్కువ ఎఫెక్ట్ తెచ్చే వాలి కాస్ట్యూవ్‌ు్స, జయకృష్ణ రూపకల్పన, డ్యాన్‌‌స మాస్టర్ శ్రీను నృత్యం, వి.ఎస్.ఆర్. స్వామి కెమేరా వర్‌‌క అద్భుతం.
 ఈ సిన్మాలో కళ్ళకు గంతలు కట్టుకొని, శబ్దం వచ్చిన చోట కొట్టే ఫైట్ ఉంటుంది. అది నా ఆలోచనే. ఆ ఫైట్స్‌లో నేను ఎక్స్‌పర్‌‌ట. ఆ ఫైట్‌ను ఇంకా పూర్తి స్థాయిలో మరో భారీ ఫిల్మ్‌లో చేద్దామ నుకున్నా. కుదర్లేదు. ప్రభాస్ ‘భక్త కన్నప్ప’లో అది పెడతాం.

 ‘కృష్ణవేణి’ తీసిన వి. మధుసూదనరావు గారే మొదట ఈ సినిమాకు దర్శకుడు. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు. శివభక్తుడి పురాణగాథను సైంటిఫిక్‌గా డీల్ చేయాలనుకొన్నాం. అలా చేసిన స్క్రీన్‌ప్లే విని కొంతమంది ఇది ‘కమ్యూనిస్ట్ కన్నప్ప’ అన్నారు. ఇదేదో తేడా అవుతోందని దర్శక-రచయితలు బాపు,రమణల్ని ఆశ్రయించా. దిగ్దంతులైన వాళ్ల మార్పుల్తో ‘భక్త కన్నప్ప’ తయారైంది.

పట్టిసీమలో కొండ మీద గుడి. అక్కడే చాలారోజులు షూటింగ్. జనరేటర్‌‌స, లైట్లు గోదావరిపై పంటులో దాటించి, మిలటరీ ట్రక్‌ల పద్ధతిలో కొండెక్కించారు.షూటింగ్ కోసం వందలాది యూనిట్‌కి అడవి మధ్య లోనే కరెంట్, నీటి వసతితో ఒక కాలనీ కట్టేశారు.బాపు ఉదయాన్నే అడవికెళ్ళి పిట్టల కూతలు, గాలి, జలపాతం హోరు... ఇలా అటవీ శబ్దాలన్నీ రికార్డ్ చేసుకొచ్చేవారు. సెపరేట్ ట్రాక్ చేసి సిన్మాలో ఎట్మాస్ఫియరిక్ సౌండ్‌గా మిక్స్ చేశారు. ఈ శ్రమతో రీరికార్డింగ్ (ఎస్పీ రామనాథన్)కి ‘జాతీయ అవార్డు’ వచ్చింది.‘భక్త కన్నప్ప’కి ముందే కన్నడంలో ‘బేడర కణ్ణప్ప’ (1954-తెలుగులో ‘శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం’) చేసిన రాజ్‌కుమార్ తర్వాత ఈ తెలుగు స్క్రిప్ట్ కూడా తీసుకొని, కుమారుడితో మరోసారి కన్నప్ప తీశారు.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu