బ్రసెల్స్ :
దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపితే ప్రాణాలతో తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యమేనా? కానీ బ్రెజిల్‌లోని ఓ నగరంలో సరిగ్గా అలాగే జరిగింది. ఓ దుండగుడు ఓ షాపు యజమానిపై పాయింట్ బ్లాంక్ రేంజిలో రివాల్వర్‌తో కాల్పులు జరిపినా, సదరు షాపు యజమాని మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వ్యవహారం మొత్తం మీడియాకు ఎక్కింది. దుండగుడు వచ్చి ధనా ధనా కాలుస్తుంటే ఏం చేయాలో తెలియని షాపు యజమాని చివరకు ఓ కార్డుబోర్డు అట్ట పట్టుకుని దాని వెనకాల దాక్కున్న దృశ్యం కూడా కనిపించింది. దుండగుడు అంతలా కాల్పులు జరిపినా, కేవలం రెండు బుల్లెట్లు మాత్రమే టార్గెట్‌కు తగిలాయి.
వాటిలో ఒకటి తల పక్క నుంచి రాసుకుంటూ వెళ్లిపోయింది. మరో బుల్లెట్ మాత్రం అతడు అడ్డుపెట్టుకున్న కార్డుబోర్డు నుంచి దూసుకెళ్లి పొట్టలో దిగింది. కానీ, వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్ తీసేశారు. దాంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. బ్రెజిల్‌లోని అరగువాపజ్ నగరంలో ఇదంతా జరిగింది. బాధితుడు జైరే నాటో గొంజాలో డిసౌజా (35) చిన్న వస్త్రదుకాణం పెట్టుకున్నాడు. పొద్దున్నే షాపు తెరిచి ఇంకా సర్దుకుంటూ ఉండగానే ఈ దుండగుడు వచ్చి కాల్పులు జరిపాడు. చీపురు, చెత్తబుట్ట తీసుకుని బయటకు వస్తుండగా వెనకనుంచి వచ్చిన దుండగుడు అతడి తలమీద పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చాడు. పదే పదే కాల్చినా.. దుండగుడు టెన్షన్‌లో ఉండటం వల్లో ఏమో గానీ, చాలా షాట్లు మిస్సయ్యాయి. దుండగుడు అక్కడి నుంచి పారిపోయినా... సీసీటీవీ ఫుటేజి చూసిన పోలీసులు.. అతడు ఇప్పటికే ఓ హత్యకేసులో పరారీలో ఉన్న నిందితుడని గుర్తించారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment