-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

March 21, 2016

ఇది విరాట్‌ శకం..!


భారత క్రికెట్‌ అంటే సచిన్‌.. సచిన్‌ అంటే భారత క్రికెట్‌! అతడి ముందు, వెనక కూడా ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు! కానీ భారత అభిమానుల గుండెల్లో సచిన్‌ స్థానం సచిన్‌దే! మాస్టర్‌ రిటైరైతే అతణ్ని భర్తీ చేసే ఆటగాడు ఇంకొకడు వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు! కానీ సచిన్‌ ఉండగానే అతడి వారసుడిని తానేనని చాటిన కోహ్లి.. ఇప్పుడు భారత క్రికెట్‌ దేవుడిని మరిపించే ఆట ఆడుతున్నాడు. తన ఆటతో సచిన్‌ పంచిన ఆనందాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు! భారత క్రికెట్‌ను అతడిలా ఇంకెవ్వరూ మలుపు తిప్పలేరు! అతడి స్థాయిలో ఎవ్వరూ అభిమానాన్ని కూడా సంపాదించలేరు! కానీ ఆట పరంగా మాత్రం.. కోహ్లి మాస్టర్‌నే మరిపిస్తున్నాడు. సచిన్‌ను మాత్రమే అభిమానించే వారి మనసుల్ని కూడా దోచేస్తున్నాడు విరాట్‌!
సచిన్‌ రికార్డులు చెక్కుచెదరవని అనుకున్నారంతా! కానీ విరాట్‌ వన్డేల్లో 27 ఏళ్లకే 25 సెంచరీలు కొట్టేశాడు. సచిన్‌ నెలకొల్పిన కొన్ని రికార్డుల్ని ఇప్పటికే వేటాడేశాడు. ఇంకొన్ని రికార్డులపై కన్నేశాడు. గణాంకాలు, రికార్డుల లెక్కలు పక్కనబెట్టేస్తే.. అభిమానం పరంగా కూడా సచిన్‌ను అందుకునే దిశగా అడుగులేస్తున్నాడు విరాట్‌. నిన్నటి ఈడెన్‌ ఇన్నింగ్స్‌తో భారత అభిమానులపై ఓ సమ్మోహన అస్త్రాన్నే విసిరాడు విరాట్‌. అత్యంత కీలక మ్యాచ్‌లో.. చిరకాల ప్రత్యర్థిపై.. జట్టు కష్టాల్లో ఉన్నపుడు.. తనపైనే ఆశలు పెట్టుకున్న స్థితిలో అమోఘమైన ఇన్నింగ్స్‌ ఆడి.. అందరి మనసులు గెలిచాడు విరాట్‌. కోహ్లి కెరీర్‌ ఆరంభం నుంచి నిలకడగానే ఆడుతూ సచిన్‌ వారసుడిగా గుర్తింపు సంపాదించాడు కానీ.. దుందుడుకు స్వభావం కారణంగా సచిన్‌లా అందరి ఆమోదం పొందలేకపోయాడు. ఐతే గత రెండేళ్లలో విరాట్‌ స్వభావం మారింది. దూకుడు ఆటకే పరిమితం చేస్తూ.. అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. జట్టుకు వెన్నెముకలా మారాడు. అత్యంత కీలకమైన మ్యాచ్‌ల్లో.. అందరూ విఫలమైనపుడు.. గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన విలువను పెంచుకుంటున్నాడు. ఇప్పుడు ప్రత్యర్థి జట్లన్నీ ఎక్కువగా కోరుకునేది విరాట్‌ వికెట్టే. యువ క్రికెటర్లకు అతను ఆదర్శం. వేరే దేశాల్లోనూ విరాట్‌కు భారీగా అభిమానులు తయారవుతున్నారు.
ఒత్తిడి ఎంత ఎక్కువైతే..: 
గొప్ప ఆటగాళ్లు కూడా ఒత్తిడిలో తడబడి పోతుంటారు. ఐతే విరాట్‌ మాత్రం దీనికి భిన్నం. ఎంత ఎక్కువ ఒత్తిడి ఉంటే అంత బాగా ఆడటం అతడి శైలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడే అతడిలోని అత్యుత్తమ ఆటగాడు బయటికి వస్తాడు. 2012లో ఆస్ట్రేలియాలో శ్రీలంకపై భారత్‌ 40 ఓవర్లలోనే 320 పరుగులు చేస్తేనే సిరీస్‌లో నిలిచే పరిస్థితి ఎదురైంది. ఆ స్థితిలో విరాట్‌ ఆడిన ఇన్నింగ్స్‌ అతడి కెరీర్‌కే తలమానికం! కోహ్లిలో ఎంత కసి ఉందో.. ఎంత దూకుడుందో.. అప్పుడే అందరికీ అర్థమైంది. కేవలం 86 బంతుల్లోనే 133 పరుగులు చేసి.. ఇంకో 3-4 ఓవర్లుండగానే భారత్‌ను విజేతగా నిలిపాడు విరాట్‌. మలింగ లాంటి వాడు విరాట్‌ ధాటికి 7.4 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు సమర్పించుకోవడం విశేషం.ఆ తర్వాతా విరాట్‌ ఇలాంటి ఇన్నింగ్స్‌లెన్నో ఆడాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా ఉన్నపుడు.. ఒత్తిడి పెరుగుతుంటే.. అడ్డదిడ్డమైన షాట్లు ఆడుతుంటారు బ్యాట్స్‌మెన్‌. ఐతే విరాట్‌ మాత్రం ఎలాంటి స్థితిలోనైనా చక్కటి క్రికెటింగ్‌ షాట్లే ఆడతాడు. పాక్‌తో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో మాలిక్‌ బౌలింగ్‌లో ఆడిన స్వీప్‌తో సిక్సర్‌ బాదిన తీరు చూస్తే.. విరాట్‌ ఎలా కొలిచినట్లు ఆడతాడో అర్థమవుతుంది.
ఇలాంటి గణాంకాలు అతడికే సొంతం..: టీ20ల్లో 30 సగటు ఉన్నా గొప్పే.. అలాంటిది 40 మ్యాచ్‌ల తర్వాత కూడా 53 సగటుతో ఉన్న అరుదైన ఆటగాడు విరాట్‌. అతడి వన్డే సగటు 51. ఇక రెండోసారి బ్యాటింగ్‌ చేస్తున్నపుడు విరాట్‌ గణాంకాలు అమోఘం. వన్డేల్లో తొలి ఇన్నింగ్స్‌ల్లో అతడి సగటు 41.23 అయితే.. రెండో ఇన్నింగ్స్‌ సగటు 61.22. మొదట బ్యాటింగ్‌ చేస్తూ 10 శతకాలు సాధిస్తే.. రెండోసారి 15 సెంచరీలు బాదాడు. టీ20ల్లోనూ అంతే. తొలి ఇన్నింగ్స్‌లో 35.88 సగటుతో 451 పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో 83.6 సగటుతో 641 పరుగులు సాధించాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ సహా ఎందరో ఆటగాళ్లకు రెండో ఇన్నింగ్స్‌ సగటు, పరుగులు.. తొలి ఇన్నింగ్స్‌ కంటే తక్కువ. రెండో ఇన్నింగ్స్‌ గణాంకాలు మెరుగ్గా ఉండటమే గొప్ప విషయమంటే.. విరాట్‌ గణాంకాలు మరీ నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. టీ20 ప్రపంచకప్‌ల్లో రెండోసారి బ్యాటింగ్‌ చేస్తూ విరాట్‌ 7 మ్యాచ్‌ల్లో 185కు పైగా సగటుతో 375 పరుగులు చేయడం అద్భుతమే. అందుకే ఛేదనలో విరాట్‌ను మించిన మొనగాడు కనిపించడు.
ఎక్కడ ఎలా ఆడాలో..: హోబర్ట్‌లో లంకపై ఆరంభం నుంచే ఓవర్‌కు 8 చొప్పున పరుగులు చేయాల్సిన స్థితిలో విరాట్‌ ఎలా విరుచుకుపడ్డాడో.. మొన్న ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై 84 పరుగుల ఛేదనలో బౌలర్లకు స్వర్గధామంలా కనిపించిన పిచ్‌పై అంత సంయమనం పాటించాడు. తాజాగా పాక్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ముందు నెమ్మదిగా ఆడి.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాక.. అవసరానికి తగ్గట్లు వేగం పెంచాడు. సింగిల్స్‌తో స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంలో కోహ్లి నేర్పరి. బౌండరీలు బాదకుండానే.. సింగిల్స్‌, డబుల్స్‌తోనే పరుగులు కూడగట్టేస్తాడు. చూస్తుండగానే 20లు, 30ల్లోకి వెళ్లిపోతాడు. క్రీజులో కుదురుకున్నాడో ఇక బౌండరీల వర్షమే. బౌలర్లను గౌరవించడం విరాట్‌లోని మరో మంచి లక్షణం. ఆసియాకప్‌లో ఆమిర్‌ చెలరేగుతుంటే.. అతడి బంతుల్ని ఆచితూచి ఆడాడు. అతను చెత్త బంతులు వేసేదాకా ఎదురు చూశాడు. తాను కుదురకుని.. అతను కాస్త గతి తప్పాక బౌండరీలు ఆడాడు. ఇక్కడే విరాట్‌కు, మిగతా ఆటగాళ్లకు తేడా కనిపిస్తుంది.
అందరిలో ఒకడే...
విరాట్‌ కంటే ప్రతిభ ఉన్నవాళ్లు టీమ్‌ఇండియాలో.. మిగతా జట్లలో లేకపోలేదు. కానీ అతడిని మిగతా వాళ్లకు వేరు చేసేది అతడి ద్పక్పథం, నేర్చుకునే తత్వం, కష్టపడే గుణమే. విరాట్‌ సచిన్‌లాగా ఒక్కసారిగా స్టార్‌ అయిపోలేదు. మాస్టర్‌లాగా సమ్మోహన పరిచే బ్యాటింగ్‌ శైలి అతడికి లేదు. డివిలియర్స్‌లాగా 360 డిగ్రీలు ఆడే నైపుణ్యం అతడికి లేదు. కేవలం శ్రమతోనే విరాట్‌.. ఈ స్థాయికి ఎదిగాడు. ప్రతిభ పరంగా చూస్తే రోహిత్‌ శర్మ విరాట్‌ కంటే ఓ మెట్టు పైనే ఉంటాడు. కానీ విరాట్‌ కంటే మూణ్నాలుగేళ్లు ముందే జట్టులోకి వచ్చిన అతడు.. ఇప్పటికీ కుదురుకోలేదు. కానీ విరాట్‌ మాత్రం చాలా త్వరగా జట్టు తనపై ఆశలు పెట్టుకునే స్థాయికి ఎదిగాడు. ఫిట్‌నెస్‌తో పాటు ఎన్నో విషయాల్లో విరాట్‌కు, రోహిత్‌కు తేడా గమనించవచ్చు. వికెట్ల మధ్య పరుగు తీసేటపుడు తెలుస్తుంది విరాట్‌ ఎంత ఫిట్‌గా ఉన్నాడో. ఇక విరాట్‌ హుషారు గురించైతే చెప్పక్కర్లేదసలు! నిరంతరం తన బ్యాటింగ్‌కు పదును పెట్టుకుంటూ.. ఫిట్‌నెస్‌ పెంచుకుంటూ.. తప్పుల్ని దిద్దుకుంటూ.. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ.. సమకాలీన క్రికెట్లో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు విరాట్‌!

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu