-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

March 24, 2016

ధోని సేన సెమీస్ కు చేరాలంటే..

freshdeals365.com

వరల్డ్ టీ 20లో భాగంగా  బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది టీమిండియా.  అయితే  ధోని సేన సెమీస్ కు చేరాలంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో  తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు టీమిండియా నెట్ రన్ రేటే ప్రధాన కారణం.  భారత్ రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించినా రన్ రేట్ లో మాత్రం పాకిస్తాన్, ఆసీస్  జట్ల కంటే వెనకబడింది. ఇదే సమయంలో శుక్రవారం ఆసీస్-పాకిస్తాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే అక్కడితో ఆ జట్టు కథ ముగుస్తుంది.

అదే సమయంలో గ్రూప్-2 నుంచి  సెమీస్ లోకి ప్రవేశించే రెండో జట్టు కోసం ఆసీస్-భారత జట్ల మధ్య పోటీ నెలకొని ఉంటుంది. ఇక్కడ భారత్ గెలిస్తే నేరుగా సెమీస్ కు చేరుతుంది.  ఒకవేళ ఆసీస్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచి, భారత్ పై ఆసీస్ గెలిస్తే మాత్రం ఈ మూడు జట్లు తలో రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించినట్లువుతుంది. అప్పుడు నాకౌట్ సమీకరణాలకు నెట్ రన్ రేట్ పైనే ఆధారపడాలి. అయితే ప్రస్తుత భారత్ నెట్ రన్ రేట్ (-0.546) ఆందోళనకరంగా ఉండగా,  పాకిస్తాన్ రన్ రేట్ (+0.254), ఆస్ట్రేలియా రన్ రేట్(+0.108)లు ముందంజలో ఉన్నాయి. భారత్ గెలిచిన రెండు మ్యాచ్ లతో పాటు, నెట్ రన్ రేట్ ను చూస్తే మన జట్టు సెమీస్ కు చేరడం కష్టమే. వీటితో సంబంధం లేకుండా ధోని సేన సెమీ ఫైనల్ కు చేరాలంటే కచ్చితంగా ఆసీస్ పై మ్యాచ్ ను గెలవడం ఒక్కటే మార్గం. 

ఇదిలా ఉండగా వరల్డ్ టీ 20లో టీమిండియా ఇంకా పూర్తిగా గాడిలో పడలేదనే చెప్పాలి.  ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను,  ఆ తరువాత స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ ను, బంగ్లాదేశ్ లో జరిగిన ఆసియాకప్ ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన భారత్.. వరల్డ్ టీ 20 వచ్చేసరికి మాత్రం జట్టు పూర్తిస్థాయిలో ఆడటం లేదు.  ఈ టోర్నీలో న్యూజిలాండ్ తో ఓటమి అనంతరం భారత్ సాధించిన రెండు విజయాలు స్థాయికి తగినవి ఎంతమాత్రం కావు.  పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత జట్టు భారీ స్కోర్లు సాధించడానికి నానా తంటాలు పడుతుంది. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఉంది భారత జట్టు పరిస్థితి.  

వరల్డ్ కప్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ధోని సేన యావత్తు భారత అభిమానుల ఆశలను నిజం చేయాలంటే ఇకనైన బ్యాట్ ఝుళిపించక తప్పదు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ ను నిలువరించాలంటే భారత జట్టు అంచనాలను అందుకోవాలి. సమష్టిగా రాణిస్తేనే ఆసీస్ పై విజయం సాధ్యమవుతుందని ధోని అండ్ గ్యాంగ్ గ్రహించాలి.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu