-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 20, 2016

మూడు ప్రేమకథల ‘ప్రేమమ్‌’




నాగచైతన్య కథానాయకుడిగా ‘ప్రేమమ్‌’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి తెలుగులో కూడా అదే టైటిల్‌ నిర్ణయించారు. ‘ప్రేమకథలకు ముగింపు ఉంటుంది కానీ అనుభూతులకు ఉండదు’ అన్నది ఉపశీర్షిక. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రమిది. శ్రుతీహాసన, అనుపమ పరమేశ్వరన, మడోన్నా సెబాస్టియన్ నాయికలు. నిర్మాత మాట్లాడుతూ ‘‘చక్కని మ్యూజికల్‌ లవ్‌స్టోరీ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. 50 శాతం చిత్రీకరణ పూర్తైంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం’’ అని తెలిపారు. చందు మాట్లాడుతూ ‘‘మూడు ప్రేమకథల సమ్మేళనమే ఈ సినిమా. ప్రతి కథ నవ్యత కలిగి ఉంటుంది. నాగచైతన్య పాత్ర మూడు వైవిధ్యమైన కోణాల్లో ఉంటుంది. పాత్రోచితంగా ఒకదానికొకటి భిన్నంగా సాగుతూ ఆసక్తి కలిగిస్తాయి. శ్రుతీహాసన్, అనుపమ, మడోన్నా కథకు కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతారు’’ అని అన్నారు. బ్రహ్మాజీ, జీవా, చైతన్యకృష్ణ, అరవింద్‌ కృష్ణ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: గోపీ సుందర్‌, రాజేశ్ మురుగేశన్, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu