-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 14, 2016

సుమతో ఏడు రోజుల ఉత్తుత్తి పెళ్లి!




రాజీవ్‌ కనకాల... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కళ్ళతో పలికించే నటకు నేటితరం బ్రాండ్‌నేమ్‌. రెండో టేక్‌ తీసుకోని నటుడిగా ఇండస్ట్రీలో వెల్‌నోటెడ్‌. బుల్లితెర, వెండితెరలపై హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టీనేజ్‌నుంచీ విభిన్న పాత్రలతో మెప్పిస్తున్న రాజీవ్‌తో ఈ వారం షూటింగ్‌ ముచ్చట్లు... 

‘జీవనరాగం’ సీరియల్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పటి సంగతిది. తెలుగు వాళ్ళు వివిధ సందర్భాల్లో పాడుకొనే పాటలన్నీ చిత్రీకరిస్తున్నారు. అలా పెళ్ళి పాటలు కూడా చిత్రీకరిస్తున్నారప్పుడు. నాది పెళ్ళికొడుకు వేషం. పెళ్ళికూతురు ఎవరో కొత్త అమ్మాయి. పెళ్ళికూతురు తరపు వ్యక్తులుగా సనను, సుమను హారతి పళ్ళెంతో నిలబెట్టారు. ఇంకా తనకు చెప్పలేదుగానీ అప్పటికే సుమని లవ్‌ చేస్తున్నాను. ‘పెళ్ళికూతురుగా సుమను పెడితే ఎంత బావుండేది...’ అని చాలా ఫీలయ్యాను. రెండో రోజు షూటింగ్‌కి వెళితే దూరం నుంచి పెళ్ళి కూతురి గెటప్‌లో ఉన్న అమ్మాయి సుమలా అనిపించింది. ‘దేవుడా... దేవుడా... సుమే అవ్వాలి’ అని మనసులో అనుకుంటూ దగ్గరికెళ్ళి చూశాను... సుమే! ఇక నా ఆనందానికి అవధుల్లేవు. అంతకు ముందు రోజు పెళ్ళికూతురి వేషం వేసిన అమ్మాయి, పాటలో శోభనం సీన్లు కూడా ఉంటాయని తెలిసి భయపడి వెళ్ళిపోయిందట. ఇక అప్పటికప్పుడు సుమతో ఆ వేషం వేయించారు. ఆ పెళ్ళి పాటను ఏడురోజుల పాటు చిత్రీకరించారు. అలా మా పెళ్ళికి ముందే మాకు ఏడురోజుల పెళ్ళి జరిగింది. ప్రేమలో ఉన్నప్పుడు అంత చక్కటి అనుభూతి దక్కడానికి కారణమైన డైరెక్టర్‌ మీర్‌గారికి, ముఖ్యంగా... భయపడి పారిపోయిన ఆ కొత్త అమ్మాయికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. 
 
పెళ్ళికొడుకుగా స్మశానానికి
నా పెళ్ళి నాటికి రెండు మూడు డైలీ సీరియల్స్‌ షూటింగ్స్‌తో ఊపిరిసలపకుండా ఉండేవాడిని. పెళ్ళి ముందురోజు వరకూ కూడా షూటింగ్స్‌ చేయాల్సి వచ్చింది. లేకుంటే డైలీ సీరియల్స్‌ ఎపిసోడ్స్‌ ఆగిపోయే పరిస్థితి. పెళ్ళికి రెండు రోజుల ముందు నన్ను పెళ్ళికొడుకును చేసి, పెళ్ళి కంకణం కట్టారు. ఆ రోజునుంచి ఊరిపొలిమేరలు దాటొద్దని ఇంట్లో స్ట్రిక్ట్‌ ఆర్డర్స్‌ ఇచ్చేశారు. బయటికి కదా వెళ్ళొద్దన్నారు అని ఊర్లో షూటింగ్‌కి వెళ్తే తీరా అది ఒక స్మశానం. తెరమీద కనిపిస్తే బాగోదని, చేతికున్న పెళ్ళి కంకణం కూడా తీసేయమన్నారు. షూటింగ్‌ ఆపుదామా అంటే అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న ‘కస్తూరి’ సీరియల్‌ అది. కక్కలేని, మింగలేని పరిస్థితి అయింది నాకు. ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఇలాంటివి కామనే అని సర్దిచెప్పుకుని షూటింగ్‌ కానిచ్చేశాను. 
 
సూపర్‌ మ్యాన్ శివ బాలాజీ
కోకిల సినిమాలో నేను, రాజా, శివ బాలాజీ హీరోలం. సలోనీ హీరోయిన్. దానిలో మా ముగ్గురికీ కలిపి సలోనీతో బిట్లు బిట్లుగా ఒక డ్యూయెట్‌ ఉంది. మంచి ఎండలో ఒక ఫోర్ట్‌ మీద ఆ పాట చిత్రీకరించారు. రాజా, శివ వాళ్ళ బిట్లు అయిపోవడంతో పక్కన నుంచున్నారు. నేను, సలోనీ డాన్స్ చేస్తున్నాం. ఎండలో చాలాసేపటి నుంచి డాన్స్ చేస్తుండటంతో సలోనీ కళ్ళు తిరిగి పడిపోయింది. నేను డాన్స మూమెంట్‌ ఆపి ఆమెను లేపుదామని వంగే లోపు, ఎక్కడో దూరంగా ఉన్న శివ బాలాజీ సూపర్‌ మ్యాన్‌లా అక్కడ ప్రత్యక్షమై సలోనీని పైకి లేపేస్తున్నాడు. ఏంటిరా ఇంత స్పీడుగా వచ్చావు? నేను పడినా అలానే వస్తావా అని అడిగా. ‘ఛ.. నువ్వు పడితే ఎందుకు వస్తానురా’ అని డబుల్‌ మీనింగ్‌తో మాట్లాడాడు. ‘ హీరోయిన్ని లేపితే హీరో అవుతాను. నిన్ను లేపితే ఏం వస్తుంది? ఎండలో మాడటం తప్ప’ అనినవ్వాడు. 
 
నా గొయ్యి నేనే తవ్వుకున్నా ...
స్టూడెంట్‌ నెం.1 సినిమాలో ఇంటర్‌వెల్‌ ఫైట్‌కు ఫైట్‌ మాస్టర్‌ అంటూ ఎవరూ లేరు. రాజమౌళి, తారక్‌(జూనియర్‌ ఎన్టీఆర్‌), నేను కలిసి ఈ సీన్ ఇలా చేస్తే బావుంటుంది... అలా చేస్తే బావుంటుంది అని డిస్కస్‌ చేసుకుని చేశాం. ఆ ఫైట్‌లో తారక్‌ నన్ను పరిగెట్టించి, పరిగెట్టించి కొడతాడు. అలా చేస్తే బావుంటుందని నేనే సలహా ఇచ్చా. ఆ సీన్ బాగా క్లిక్‌ అయ్యింది కూడా. అలాగే, అశోక్‌ వంటి కొన్ని సినిమాల్లో నన్ను పరిగెట్టించి చంపుతున్నప్పుడు కళ్ళల్లోంచి ప్రాణం పోతున్నట్టుగా నా ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అలాంటివి బాగా క్లిక్‌ అవడంతో నేను అలాంటి సీన్లు చేస్తే ఆ సినిమా హిట్‌ అనే సెంటిమెంట్‌ ఇండస్ర్టీలో కొందరికి బాగా నాటుకు పోయింది. సెంటిమెంట్‌ సంగతేమోగానీ, పరిగెట్టి పరిగెట్టి కాళ్ళు పీక్కుపోతున్నాయినాకు. అలాగే కళ్ళల్లోంచి ప్రాణం పోతున్నట్లు నటించడం కూడా నా చావుకొస్తోంది. వివిధ యాంగిల్స్‌లో పూటలకి పూటలు ఆ సీన్‌లు చిత్రీకరించడం వల్ల తల నరాలన్నీ పట్టేసి కళ్ళు లాగేస్తున్నాయి. పైగా కళ్ళల్లో ఎర్రజీరలు, నీటిపొర కనిపించడానికి అదేపనిగా గ్లిజరిన్ వేసుకోవాల్సి రావడంతో నరకం కనిపిస్తోంది. ‘స్టూడెంట్‌ నెం. 1’ మొదలుకొని నిన్న మొన్నటి ‘రాజుగారి గది’ సినిమా వరకూ చాలా సార్లు ఇదే నా పరిస్థితి. 
 
రష్మి మాత్రం అలా చేసింది ...
యాంకర్‌ రష్మి హీరోయినగా వస్తున్న ‘చారుశీల’లో నాకు, రష్మికి మధ్య ఒక ఫైట్‌ చిత్రీకరించారు. రష్మి నా వెనక నుంచి నన్ను కొడుతుంటే, నేను వెనక్కి తిరక్కుండానే పెద్ద రాయితో తన ముఖం మీద కొట్టే సీన్ ఒకటి ఉంది. అసలే ముఖాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకునే గ్లామర్‌ ఫీల్డ్‌ ఇది. టైమింగ్‌ మిస్‌ అయ్యి దెబ్బ ముఖానికి తగిలితే ఇంకేమన్నా ఉందా...! అందుకే ఆమెకు దెబ్బతగలకూడదని కాస్త పక్కకి పంచ్ విసిరాను. ఆ వేగంలో నా చేయి కాస్త పక్కకి జరిగిందో ఏమో ఆ రాయి నా తలకి తాకింది. నుదురు చిట్లి రక్తం బొటబొటా కారింది. ఇక ఆ రోజంతా తల దిమ్ముగా ఉంది. అలా రష్మీ సేఫ్టీ గురించి ఆలోచించి, నేను మాత్రం నుదుటిపై గాటు పెట్టుకున్నాను. ఇంతా చేస్తే రష్మీ నాచురాలిటీ కోసం రియల్‌ ఫైట్స్‌ చేసి ఏమాత్రం జాలి లేకుండా నా ఒళ్ళు కుళ్ళబొడిచింది. 
 
పుత్తూరు కట్టు కట్టించి మరీ షూటింగ్‌ చేశారు
‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ సినిమా షూటింగ్‌ చాలా భాగం తలకోన అడవుల్లో రాత్రిళ్ళు జరిగింది. నేను హీరోయిన్ని తరుముతూ నీళ్ళలో పడిలేచి ఆమెని పట్టుకుని చెట్టుకేసి కొట్టే సీన్ ఒకటి చిత్రీకరిస్తున్నారు. నీళ్ళల్లో పడ్డప్పుడు షూ తడిచిపోయి పరిగెడుతుంటే జారిపోయి కాలు మెలికపడింది. కాలి లిగమెంట్‌ దెబ్బతినడంతో విపరీతమైన బాధ. షెడ్యూల్‌ అయిపోవస్తుండటంతో దగ్గరలోని పుత్తూరుకు తీసుకువెళ్ళి కట్టుకట్టించారు. రోజూ నలుగురైదుగురు నన్ను మంచం మీద షూటింగ్‌ స్పాట్‌కు మోసుకెళ్ళేవారు. ఆ చీకట్లో మంచం మీద పడుకుని పైకి చూస్తే గుబురైన చెట్లమీదనుంచి ఏమైనా పడుతుందేమో అనిపించేది. ఎటునుండైనా పులో ఏనుగో వస్తే, వీళ్ళు మంచం వదిలేసి పరుగుపెడితే నా గతేమిటి? ఇలా రకరకాల ఆలోచనలు వచ్చి బిక్కచచ్చిపోయేవాడిని. నా కాలికి గాయం అయినట్టు సుమతో సహా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎలాగో కొద్ది రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాం కదా, ఈలోపు వాళ్ళని కంగారు పెట్టడం దేనికని. అయితే ఒక రోజు సుమ ఫోన్ చేసి ‘రాజీవ్‌ నువ్వు బాగానే ఉన్నావా... నాకెందుకో నీకు దెబ్బతగిలినట్టు, ఒంట్లో బాగోనట్టు అనిపిస్తోంది’ అంది. అలాంటిదేంలేదే అని బొంకేశాను. నాకు దెబ్బ తగిలినట్టు నా క్లోజ్‌ఫ్రెండ్‌ అయిన మా బావ రామారావు ఒక్కడికే తెలుసు. అతనేమైనా చెప్పేశాడా అని అనుమానం వచ్చి వెంటనే ఫోన్ చేసి, సుమకు చెప్పేశావు కదా ? అని అడిగా. ‘ఒట్టు, నేను చెప్పలేదు’ అన్నాడు. అప్పుడనిపించింది మనం ప్రేమించే వాళ్ళకు ఏమైనా అయితే మనసు పసిగట్టేస్తుందనే మాట నిజమేనని. ఒక్కోసారి ఒంటికి గాయమైనా దాని వల్ల మనసుకు హాయినిచ్చే అనుభవాలు మిగులుతాయి. సినిమాల్లో అయ్యే గాయాలు, పడిన శ్రమ కూడా అభిమానుల ఆదరణ ముందు తీసికట్టే.
Photo Gallery


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu