ప్రణతిమనోజం! ప్రణయ సరాగం!!
PUBLISHED ON: February 13, 2016
BY: Unknown
IN: MOVIE NEWS
హుషారు.. దూకుడుకు ప్యాంటూ, చొక్కా తొడిగితే మంచు మనోజ్... చిరునవ్వు మోము... ప్రశాంత వదనంతో కనిపించే పక్కింటమ్మాయి ప్రణతి రెడ్డి... రెడీ.. కెమేరా.. యాక్షన్‌తో తీరిక లేని మంచువారబ్బాయి... అంకెలతో కుస్తీ పడుతూ.. కంపెనీల రాతలు రాసే ఆమె... అయితేనేం... ఈ భిన్న ధృవాలను ఏకం చేసింది ప్రేమ... ఆపై రెండు మనసులు వూసుల సంద్రంలో ప్రయాణం మొదలుపెట్టాయి... విరహపు నావలో వారి అభిప్రాయాలు పెనవేసుకున్నాయి... మూడుముళ్ల బంధంతో ఏకమై ఈమధ్యే సంసార తీరం చేరాయి... రేపు వేలంటైన్స్ డే అనగానే... ఐదేళ్ల బంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఆ ఇద్దరు ఈతరంతో మనసారా చెప్పిన ముచ్చట్లివి.
తన పెళ్లిచూపులు చెడగొట్టా హాయ్ గాయ్స్ అండ్ గాళ్స్...
నేరుగా విషయానికొచ్చేస్తా. ప్రణతి మా వదిన క్లాస్‌మేట్. ఆమెను కలవడానికి మా ఇంటికొచ్చిందోసారి. వారంరోజుల సెలవులకోసం అమెరికా నుంచి ఇండియాకొచ్చి ఏకంగా నా గుండెలోనే తిష్ట వేసింది. మొదటిసారి తనను చూసినపుడే పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనుకున్నా. రెండోరోజు జరిగిన ఓ సంఘటన మమ్మల్ని మరింత దగ్గర చేసింది. ఆరోజు నేను ఫ్రెండ్‌తో కలిసి రెస్టరెంట్‌కెళ్లా. కాసేపయ్యాక వదిన, ప్రణతి ఇంకో అబ్బాయి అక్కడికొచ్చారు. విషయం ఏంటని అడిగితే ‘తనకిష్టంలేకపోయినా ఇంట్లోవాళ్ల బలవంతంతో ఈ అబ్బాయిని కలవడానికొచ్చింది. ఓరకంగా ఇవి పెళ్లిచూపులే’ అంది వదిన. వెంటనే మధ్యలో దూరిపోయా. ఏవేవో చెప్పేసి అర్జెంట్ పని ఉందని తనని అక్కణ్నుంచి తప్పించా. ఆ క్షణంలో నాకు ఎందుకలా చేయాలనిపించిందో... ఆ ధైర్యమెలా వచ్చిందో ఇప్పటికీ తెలియదు. అలా మా పరిచయం స్నేహంగా మారింది. తన మాటతీరు, మంచితనం, అందరితో కలిసిపోయేతత్వం నాకు తెగ నచ్చేవి. చాలాసార్లు ఆలోచించాక ఇంతకన్నా మంచి అమ్మాయి నాకు దొరకదని అర్థమై ప్రణతిని పెళ్లాడతానని నాన్నగారితో చెప్పా. మూడు నిమిషాల్లో తేల్చేసి ఆశీర్వదించారాయన. తర్వాత ప్రణతి అమ్మానాన్నలతో కూడా నేనే మాట్లాడా. అంతా ఓకే అయ్యాక ‘విల్ యూ మ్యారీ మీ’ అనడిగా. ఓకే చెప్పింది. మొదట్నుంచీ తనంటే ఇష్టం, ప్రేమ ఉన్నా ఐలవ్యూలు మాత్రం చెప్పుకోలేదు.నేను సినిమాలతో... తను ఉద్యోగం, వ్యాపారంతో బిజీ. అందుకే ఎక్కువగా బయట కలుసుకోవడం... షికార్లకెళ్లడం కుదర్లేదు. ఎక్కడున్నా అభిప్రాయాలు మాత్రం పంచుకునేవాళ్లం. పెళ్లయ్యాక కూడా ఇదే ప్రేమ, ఆప్యాయతలు కొనసాగుతున్నాయి. ఇక మామధ్య మర్చిపోలేని సంఘటన అంటే... ఈ న్యూఇయర్‌కి ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి యూరోప్ ట్రిప్‌కెళ్లాం. రాత్రి ఎనిమిది దాటితే మా అబ్బాయిల్లో జోష్ మొదలయ్యేది. అమ్మాయిల బ్యాచ్ మాత్రం ముసుగుతన్ని పడుకునేవారు. రెండు గ్యాంగ్స్ మధ్య పోట్లాట షురూ. ఇలాంటి చిన్నచిన్న గొడవలు తప్ప మా మధ్య వేరే ఇంకేం లేవు. అసలు ఓ అమ్మాయిని ప్రేమించడం అంటే ఆమె అభిప్రాయాలు, అలవాట్లు, మంచీచెడూ అన్నీ ప్రేమించాలి, గౌరవించాలి. అలా చేస్తే ఏ ప్రేమికులూ విడిపోరు.
ప్రణతిలో నచ్చేవి *పాజిటివ్ మనస్తత్వం *ఎనర్జిటిక్. బాగా నవ్వుతుంది *సొంతవాళ్లని జాగ్రత్తగా చూసుకుంటుంది *సాయపడే మనస్తత్వం *తనలో బాగా ఇష్టపడేది కళ్లు *తనిచ్చిన మొదటి బహుమతి ట్రావెల్ బ్యాగ్
|
|
అమ్మానాన్నల్ని ఒప్పించి నాకు ప్రపోజ్ నమస్తే...
ముందు నా చదువుతో మొదలెడతా. బిట్స్-పిలానీలో డిగ్రీ పూర్తిచేసి ఎంబీఏ కోసం అమెరికా వెళ్లా. అక్కడే ఛార్టెడ్ అకౌంటెంట్‌గా మంచి కంపెనీలో చేరా. 2010 జూన్‌లో ఇండియాకొచ్చినపుడు స్నేహితురాలు వెరోనికాను కలవడానికెళ్లా. అప్పుడే మనోజ్ పరిచయమయ్యాడు. తనో హీరో. స్టార్ కుటుంబం నుంచి వచ్చాడు. కానీ మాటల్లో ఆ గర్వం లేవు. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అతడి తీరు బాగా నచ్చింది. మరుసటిరోజే నాకిష్టంలేని పెళ్లిచూపుల నుంచి కాపాడటంతో మంచి స్నేహితుడు దొరికాడు అనుకున్నా. ఈ ఐదేళ్లలో మనోజ్‌లో అన్నీ మంచి క్వాలిటీస్‌నే కనిపించాయి. ఓ రోజు సడెన్‌గా నన్ను పెళ్లి చేసుకుంటావా? అనడిగాడు. మీ అమ్మానాన్నల్నీ ఒప్పించాను అనేసరికి నాకు షాక్. తను ఎదుటివాళ్లని గౌరవిస్తాడు. తన అభిప్రాయాలను ఇతరులపై రుద్దడు. అంతకుమించి నా బెస్ట్‌ఫ్రెండ్. తనతో జీవితం పంచుకుంటే లైఫ్‌లాంగ్ సంతోషంగా ఉంటాననిపించింది. వెంటనే ఒప్పేసుకున్నా.మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే. ఇక్కడేమో పెద్ద కుటుంబం. కబుర్లు, కష్టసుఖాలు పంచుకోవడానికి బోలెడుమంది. ఇంట్లో ఇప్పుడు అందరితో కలిసిపోయా. ముఖ్యంగా మామయ్య గారి దగ్గర నాకు చొరవ ఎక్కువ. సినిమాల విషయానికొస్తే పెళ్లి కాకముందు పెద్దగా చూసేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం చూస్తున్నా. నా అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తా. వేదం సినిమాలో తన క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అది మనోజ్ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. సాధారణంగా పెళ్లి తర్వాత అబ్బాయిలకు అమ్మాయిలపై ప్రేమ తగ్గిపోతుందంటారు. మనోజ్ విషయంలో అది నిజం కాదు. తనలో ఏ మార్పూ లేదు. కాకపోతే పెళ్లయ్యాక కొన్ని ప్రయారిటీస్ మారిపోతుంటాయి. ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతమాత్రాన ప్రేమ తగ్గుతుందని కాదు. షాపింగ్, ఆఫీసు పని, షికారు... నేను ఎక్కడికెళ్లినా ఇప్పటికీ తనే కారులో బయటికి తీస్కెళ్తాడు. అమెరికా వెళ్తే మాత్రం నేనే స్టీరింగ్ అందుకుంటా. ఇకపోతే మా ఆయన హీరో. నటుడు అన్నాక అభిమానులుంటారు. అందులో అమ్మాయిలూ ఉంటారు. దీనికి నేనేం అసూయ పడను. పైగా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం వేర్వేరని నాకు తెలుసు. అందుకే ఇప్పటికీ, ఎప్పటికీ తనే నా హీరో, బెస్ట్‌ఫ్రెండ్.
మనోజ్‌లో మెచ్చేవి *ఈమధ్యే కవితలు రాస్తున్నాడు *తను మంచి రేసర్. నాకు రేసింగ్ ఇష్టం *ఆలస్యంగా నిద్రపోతాడు. అదొక్కటే నచ్చదు *తనిచ్చిన ప్రేమగుర్తు స్మార్ట్‌ఫోన్ *ముద్దుగా మనూ అని పిలుస్తా
|
|
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on
FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
About the Author
Unknown
Author & Editor
No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!
Post a Comment