రామోజీ ఫిలింసిటీలో ‘సర్దార్’..‘బ్రహ్మోత్సవం’
PUBLISHED ON: February 21, 2016
BY: Unknown
IN: MOVIE NEWS
ఒకరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది... అతడే మహేష్‌బాబు!ఇంకొకరు డైలాగ్ చెబితే థియేటర్ మోతక్కి పోద్ది... అతడే పవన్ కల్యాణ్!అంతటి హీరోయిజం ఉన్న ఈ ఇద్దరూ ఒకే ఏరియాలో షూటింగ్ చేస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరు అంటారా? అలాంటి సందడి రామోజీ ఫిలింసిటీలో నెలకొంది. ఓవైపు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’గా పవన్ కల్యాణ్ దుమ్మురేపుతుంటే, మరోవైపు మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ పనుల్లో ఉన్నాడు. ఆ మధ్యలో సాయిధరమ్‌తేజ్ ‘సుప్రీమ్’ చిత్రీకరణ సాగుతోంది. ఆ సినిమా వూసులు, హీరోలు చేస్తున్న విన్యాసాలు ఓసారి చూద్దాం!
గుడిలో ‘గబ్బర్‌సింగ్’
రతన్‌పూర్‌లో చీమ చిటుక్కుమనాలన్నా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పర్మిషన్ ఉండాల్సిందే. అలాంటిది ఆ వూరు చివర గుడి దగ్గర ఆకతాయిలు అలజడి సృష్టిస్తున్నారని తెలిసింది. మరి ‘సర్దార్’ వూరుకుంటాడా? సరాసరి అక్కడికి వెళ్లి తన తిక్కేంటో చూపించాడు. ఆ ‘సర్దార్’ తాండవానికి రామోజీ ఫిలింసిటీ వేదికైంది. ఫిలింసిటీలోని గుడి ప్రాంగణంలో ఈ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్, టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన కాజల్ నటిస్తోంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలు. ఏప్రిల్ 8న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇంట్లో మహేష్
అందరం కలిసుంటేనే ఆనందం... అందరినీ కలుపుకొని ముందుకెళ్తేనే జీవితం... అని నమ్మే కుర్రాడతడు. అందుకే అతడు ఎక్కడుంటే అక్కడ ‘బ్రహ్మోత్సవం’. ఆనందమెప్పుడూ సులభంగా రాదు... అలా వచ్చింది ఉండదు... దాని వెనుక ఎన్నో కష్టాలు. అలాంటి కష్టమేదో ఆ కుర్రాడికి వచ్చినట్లుంది. అందుకే ఇంట్లో వాళ్లతో ఏదో సీరియస్‌గా మాట్లాడుతున్నాడు. ఇదంతా రామోజీ ఫిలింసిటీలోని బీఎస్‌ఎఫ్8లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో దృశ్యం. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మహేష్‌బాబు, తనికెళ్ల భరణిపై టాకీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.
రైల్వేస్టేషన్‌లో ‘సుప్రీమ్’
ఆ కుర్రాడికి జోరెక్కువ... అతడు నడిపే కారుకు స్పీడెక్కువ.. టోటల్‌గా తారాజువ్వలాంటోడు అన్నమాట. అలాంటివాడికి లక్ష్మీబాంబు లాంటి హీరోయిన్ కుదిరింది. వాళ్లిద్దరూ కలసి ఏం చేశారో ‘సుప్రీమ్’లో చూడండి అంటున్నారు అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలోని రైల్వేస్టేషన్, హాస్పిటల్‌లో సాయికుమార్, రాజేంద్రప్రసాద్‌పై చిత్రీకరిస్తున్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
About the Author
Unknown
Author & Editor
No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!
Post a Comment